Advertisement
Google Ads BL

జూలీ.. నీ టిప్స్ అదుర్స్..!


సాధారణంగా ఒకప్పుడు హీరోలు రాత్రి షూటింగ్‌ బ్రేక్‌ తర్వాత కాస్త మద్యం తీసుకుని, సిగరెట్లు తాగేవారు. వారిపై మరలా తెల్లవారు జామునే హీరోయిన్స్‌తో పాటలు, రొమాన్స్‌ సీన్స్‌ వంటివి కూడా తీసేవారు. దాంతో సరస శృంగార సన్నివేశాలలో హీరోయిన్లకు దగ్గరగా వెళ్లినప్పుడు, ముద్దు సీన్లలో హీరోయిన్స్‌కి తీవ్రమైన దుర్వాసనలు వచ్చేవి. దాంతో నాటి స్టార్స్‌ని కూడా కొందరు హీరోయిన్లు తిట్టేవారు. కానీ తమ కంటే స్థాయిలో గొప్పవారైతే వారినేమీ అనకుండా ఎలాగోలా సర్దుకునే వారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. తాజాగా మన 'ఖైదీనెంబర్‌ 150' రత్తాలు రాయ్‌లక్ష్మి ఈ విషయంలో అందరికీ చిట్కాలు చెబుతోంది. 

Advertisement
CJ Advs

మీకు స్మోకింగ్‌, డ్రింకింగ్‌ అలవాటు ఉందా? బ్రష్‌ చేసుకుని వెళ్లండి. లేదా కనీసం చూయింగ్‌గమ్‌, మౌత్‌ ఫ్రెష్‌నర్లు వాడండి. శరీరం నుంచి బ్యాడ్‌స్మెల్‌ అదేనండీ దుర్వాసన రాకుండా బాడీ స్ప్రేలు కొట్టుకోండి అని సలహాలు ఇస్తూ ఈ ప్రొడక్ట్స్‌కి అనఫిషియల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇక ఆమె మూడో టిప్‌ కూడా చెప్పేసింది. అది మాత్రం కేవలం నటీనటులకు మాత్రమే. శృంగార, హాట్‌ సన్నివేశాలలో నటించేటప్పుడు చుట్టు ఉన్న జనాలను, కెమెరాలను అన్నింటిని మర్చిపోయి అందులో తన్మయత్వం చెందమని సలహా ఇస్తోంది. అయినా రాయ్‌లక్ష్మికే కాదు.. శృతిహాసన్‌తో పాటు పలువురు స్టార్‌ హీరోయిన్లకు కూడా స్మోకింగ్‌, డ్రికింగ్‌ వంటివి అలవాటు ఉన్నాయి. దాంతో ప్రస్తుతం పరిస్థితి రివర్స్‌ అయింది. 

శృతిహాసన్‌ వంటి వారి దగ్గరకు పగలైనా సరే శృంగార సన్నివేశాలలో దగ్గరకు రావడానికి హీరోలు భయపడుతూ వారి దుర్వాసనను చూసి పారిపోతున్నారు. అప్పుడెప్పుడో కమల్‌ మీ భార్యల కోసం, కనీసం మీ గర్ల్‌ఫ్రెండ్స్‌ కోసం స్మోకింగ్‌ ఆపేయమని సలహా ఇచ్చాడు. మరి అదే సలహాను తన కూతుర్లకి ఇతర నటీమణులకు ఇస్తే బాగుంటుందేమో?. అన్నట్లు రాయ్‌లక్ష్మి నటిస్తున్న హాట్‌ చిత్రం 'జూలీ 2' ఈనెల 24న హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది. 

Raai Laxmi Tips to Drinkers and Smokers:

Raai Laxmi Brand Ambassador for Mouth Freshners
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs