Advertisement
Google Ads BL

కామెడీ చేయడానికి కండీషన్లా..?


ఒకప్పుడు టాలీవుడ్‌లో సునీల్ హవా బాగా నడిచింది. ప్రస్తుతం తాను హీరోగా మారి సినిమాలు చేశాడు. కమెడియన్‌గా సునీల్‌ని జనాలు ఎంత మెచ్చుకున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే హీరో అయిన తర్వాత మాత్రం అదే జనాలు అంతగా ఆదరించలేకపోయారు. హీరోగా మారిన సునీల్ కామెడీని పండించలేకపోతున్నాడు.

Advertisement
CJ Advs

అందులోను హీరో లుక్ కోసం సిక్స్ ప్యాక్ బాడీ గట్రా ట్రై చేసి సన్నగా మారిపోయాడు. అయితే ఇటీవల వస్తోన్న వరుస పరాజయాలకి డిప్రెషన్‌కి లోనైన సునీల్ ఏమనుకున్నాడో ఏమో మళ్లీ చాలా బొద్దుగా తయారయ్యాడు. మళ్ళీ కమెడియన్ గా రీఎంట్రీ ఇస్తునందున అలా బొద్దుగా తయారయ్యాడు అని టాక్. మళ్లీ అతనిలో 'మనసంతా నువ్వే' టైమ్‌లోని సునీల్‌ కనిపిస్తున్నాడు.

కమెడియన్ నుండి హీరోగా మారిన గ్యాప్ లో చాలా మంది కమెడియన్స్ పుట్టుకొచ్చారు. అయితే కామెడీ వేషాలు వేస్తాగాని తన పాత్రకి ప్రాధాన్యత వుండాలంటూ సునీల్‌ తెగ కండీషన్స్ పెడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా అడుగుతున్నట్లు సమాచారం. మరి ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లో సునీల్ ఇలా కండీషన్స్ పెడితే సక్సెస్ అయ్యే అవకాశాలు వుండవేమో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Sunil Conditions For Comedy Roles:

Sunil.. What Amma.. What is This Amma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs