Advertisement
Google Ads BL

ఇలాంటి వారిని ఇండియాలో ఉండనిస్తారే!


మనదేశంలో వాక్‌స్వాతంత్య్రం ముసుగులో విచ్చలవిడితనం పెరుగుతోంది. దేశసమగ్రతకు కూడా తూట్లు పొడిచేలా కొందరు కేవలం తాము వార్తల్లో ఉండటానికే ఇలా మాట్లాడుతున్నారు. మనదేశంలోనే కాదు.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, బాలీవుడ్‌కి చెందిన కపూర్‌ ఫ్యామిలీకి రాజకీయనాయకుల్లో, సినిమా రంగంలో, సినీ ప్రముఖుల్లో ఎంతో గొప్పస్థానం ఉంది. కానీ తాజాగా రిషికపూర్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయనపై దేశద్రోహం కింద కేసు పెట్టినా తప్పులేదనిపిస్తోంది. కానీ పేదలు, విద్యార్ధులను తప్పితే ఇలాంటి పెద్దోళ్లని మన ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. కాలేజీలలో, విద్యార్ధులపై చూపించే క్రౌర్యం పెద్దల విషయంలో మాత్రం మౌనసాక్షిగా మిగిలిపోతోంది. 

Advertisement
CJ Advs

తాజాగా జమ్మూకాశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్‌  మనది.. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ పాకిస్తాన్‌దే. ఇండియా, పాకిస్తాన్‌లు ఎంత ఎన్ని యుద్దాలు చేసుకున్నా ఫలితం శూన్యమని దానికి పీవోకేని పాకిస్థాన్‌కి ఇవ్వడమే మార్గమని వ్యాఖ్యానించాడు. దానికి బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రిషికపూర్‌ మాట్లాడుతూ, మిస్టర్‌ ఫరూక్‌ అబ్దుల్లా జీ... సలాం..మీ మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. జమ్ముకాశ్మీర్‌ మనది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ వారిది. నా వయసు ప్రస్తుతం 65 ఏళ్లే. నేను చనిపోయేలోపు పాకిస్థాన్‌ వెళ్లాలని భావిస్తున్నాను. నా పిల్లలు అక్కడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ ఒక్క సాయం చేయమని అడిగాడు. 

Rishi Kapoor Sensational Comments on Kashmer:

Rishi Kapoor that J&K belongs to India and PoK belongs to Pakistan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs