Advertisement
Google Ads BL

రాజశేఖర్.. రాముడ్నికాదని ఒప్పుకున్నాడు!


హీరో రాజశేఖర్‌కి పదేళ్ల తర్వాత 'పీఎస్వీగరుడవేగ'తో హిట్‌ రావడంతో ఆయన కాస్త అత్యుత్సాహం. అతి మాటలు మాట్లాడుతున్నాడనే చెప్పాలి. ఇక ఆయనకు నాటి సంచలనం తారా చౌదరితో సంబంధం ఉందా? అనే ప్రశ్నకు ఓ సారి ఆమె నాతో ఫొటో తీయించుకుంది. మొదటిసారి ఆమెను అప్పుడే చూశాను. ఆ తర్వాత ఆమె పక్క ఇంటి పోర్షన్‌ చూద్దామని వెళ్లినప్పుడు రెండోసారి చూశాను. ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె పట్టుబడిన తర్వాత తనతో తీసుకున్న ఫొటో బయటకు రావడం వల్లే ఇలాంటి ప్రచారం జరిగింది. నేను రాముడినని చెప్పడం లేదు. పెళ్లికి ముందు కొందరితో సంబంధాలు ఉండేవి. 

Advertisement
CJ Advs

ఇక నేను భయపడేది జీవితకి మాత్రమే. ఆమెకు తప్ప ఎవ్వరికీ భయపడను. జీవితను వివాహం చేసుకున్న తర్వాత కూడా కొందరితో యాక్సిడెంటల్‌గా ఎఫైర్లు ఏర్పడ్డాయి. నేను శ్రీరాముడిని అని చెప్పడం లేదు. అలాగే నేను శ్రీకృష్ణుడిని కూడా కాను. కానీ తారా చౌదరి విషయంలో మాత్రం నేను శ్రీరామచంద్రుడినే. ఇక నాపై ఇండస్ట్రీలో ప్లేబోయ్‌ ముద్ర పడటం ఆశ్చర్యకరంగా ఉంది. మరోవైపు నాకు మంచి లేడీస్‌ ఫాలోయింగ్‌ ఉందని నాకు తెలుసు. ఇక త్రిష బాత్రూం వీడియోఅని, తారా చౌదరి ఎఫైర్‌ అని మీడియా తమ సంస్థల హైప్‌కి ప్రయత్నిస్తోంది అని రాజశేఖర్‌ అనగా, ఇలాంటి వ్యవహారాల ద్వారా డబ్బు సంపాదించడం కంటే శవాల మీద డబ్బులు ఏరుకోవడం మంచిందని ఆయన శ్రీమతి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. 

Rajasekhar On Tara Chowdhary Affair:

Rajasekhar on his affair with Tara Chowdhary
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs