Advertisement
Google Ads BL

ఈ మాజీ ప్రేమికుల్లో ఎవరు గెలుస్తారో!


సల్మాన్‌ఖాన్‌, ఐశ్వర్యారాయ్‌ల ఎఫైర్‌ ముగిసిపోయి దాదాపు 15ఏళ్లయింది. ఆ తర్వాత ఆమె అభిషేక్‌ బచ్చన్‌ని వివాహం చేసుకుని దిగ్రేట్‌ బచ్చన్‌ ఫ్యామిలీకి కోడలిగా వెళ్లింది. మరోవైపు సల్లూభాయ్‌ మాత్రం ఇంకా బ్యాచులర్‌ లైఫ్‌నే ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇక సల్మాన్‌ఖాన్‌కి రంజాన్‌ ఎంతో కలిసొచ్చిన పండుగ. ఒక్క 2013 మినహాయించి, 2009 నుంచి 2017 వరకు ఆయన ప్రతి ఈద్‌ పండుగకి వచ్చాడు. 'వాంటెడ్‌, దబాంగ్‌, బాడీగార్డ్‌, ఏక్‌థా టైగర్‌, కిక్‌, భజరంగీ భాయిజాన్‌, సుల్తాన్‌, ట్యూబ్‌లైట్‌' ఇలా వస్తూనే ఉన్నాడు.కానీ ఆయన వచ్చే 2018 రంజాన్‌ సీజన్‌కి రాలేకపోవచ్చని పలువురు భావించారు. దానికి కారణం ఆయన నటిస్తున్న 'భరత్‌' చిత్రం 2019 రంజాన్‌కి వస్తుందని చెప్పడమే. 

Advertisement
CJ Advs

కానీ సల్మాన్‌ మాత్రం వచ్చే ఏడాదిని కూడా మిస్‌ కావడం లేదని తేలిపోయింది. ఈనెల 9వ తేదీన షూటింగ్‌ ప్రారంభించుకున్న 'రేస్‌3'ని వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది రంజాన్‌కే తెస్తామని దర్శకుడు రెమో డిసౌజా తెలిపాడు. విచిత్రం ఏమిటంటే.. ఐశ్వర్యారాయ్‌.. అనిల్‌కపూర్‌, రాజ్‌కుమార్‌ రావులతో కలిసి నటిస్తున్న 'ఫ్యానీఖాన్‌' చిత్రం కూడా రంజాన్‌కే విడుదల కానుంది. మరి బాక్సాఫీస్‌ వద్ద ఈ మాజీ ప్రేమికుల్లో ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సివుంది...! 

Fight between Salman Khan and Aishwarya Rai Bachhan :

Ex Lovers Fight in Ramdaan 2018
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs