Advertisement
Google Ads BL

ఈ వార్త నిజమేనా అనుష్కా..?


స్వీటీ అనుష్క తన కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచే మంచిమంచి హీరోలతో కలిసి పనిచేస్తూ వస్తోంది. ఇక 'అరుంధతి' చిత్రం ఈమె ఇమేజ్‌ని ఒక్కసారిగా మార్చేసింది. అయినా ఒకవైపు 'అరుంధతి, రుద్రమదేవి, వర్ణ, సైజ్‌జీరో' వంటి చిత్రాలు చేస్తూనే 'బాహుబలి'లో దేవసేనగా అదరగొట్టింది. ఇక ప్రభాస్‌ సరసన ఆమె 'బిల్లా, మిర్చి, బాహుబలి' వంటి చిత్రాలలో నటించి, క్యూట్‌ జంటగా పేరు తెచ్చుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్యన  ఏదో నడుస్తోందని పుకార్లు వ్యాపించాయి. మరోసారి ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తే తాను కేసులు పెడతానని అనుష్క హెచ్చరించినా కూడా ఇవి ఆగడం లేదు. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల జరిగిన ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ఆయనకి ఎంతో ఇష్టమైన బ్రాండ్‌ వాచీని అనుష్క గిఫ్ట్‌గా ఇచ్చిందని ప్రచారం జరిగింది. ఇటీవల అనుష్క కూడా తన బర్త్‌డేని జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'భాగమతి' ఫస్ట్‌లుక్‌ని యూనిట్‌ విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌ని ప్రభాస్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి ఆమెకి శుభాకాంక్షలు తెలిపాడు. ఇక అనుష్క బర్త్‌డే సందర్భంగా ప్రభాస్‌ ఆమెకి బిఎండబ్ల్యూ కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు పుట్టినరోజు సందర్భంగా ఆయా వ్యక్తులకు ఇతరులు గిఫ్ట్‌లు ఇవ్వడం సహజమే. కానీ తన బర్త్‌డే సందర్భంగా దీనికి రివర్స్‌లో అనుష్క చేసిందట. 

తనకు ఎంతో కాలంగా నమ్మిన బంటుగా ఉంటూ, తనను కంటికి రెప్పలా చూసుకుంటూ, తనకు బాడీగార్డ్‌, కారు డ్రైవర్‌ అన్ని తానై నడిపిస్తున్న వ్యక్తికి అనుష్క ఏకంగా 12లక్షల కారును గిఫ్ట్‌గా ఇచ్చిందని అంటున్నారు. కానీ ఇలాంటి వాటికి రుజువులు ఉండవు కాబట్టి నమ్మేవారికి అవి నిజం అనిపిస్తాయి.. మీరు చూశారా? రుజువులున్నాయా? అని ప్రశ్నించేవారికి అవి గాలి వార్తలు గానే అనిపిస్తాయి. 

Anushka 12 Lakhs Gift to Her Caretaker:

Anushka shetty gifted her driver a car costs 12 lakhs 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs