హీరోలకు, మరీ ముఖ్యంగా స్టార్‌హీరోలకు కోట్లలో అభిమానులుంటారు. వీరిలో వీరాభిమానులు కూడా ఉంటారు. ఆయా హీరోల సినిమాల విడుదల, లేదా బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించడం, కటౌట్లు, ఫ్లెక్సీలు, పూలు, పాలాభిషేకాలు, రక్తదాన శిబిరాలు వంటివి చేస్తే ఎలాగైనా తమ హీరోల దృష్టిలో పడాలని, తమ హీరో వద్ద తమకొక గుర్తింపు ఉండాలని తాపత్రయపడుతూ ఉంటారు. నాటి ఎన్టీఆర్‌కి వీరాభిమానిగా అఖిలభారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల అధ్యక్షులుగా పేరొందిన నెల్లూరుకి చెందిన తాళ్లపాక రమేష్‌రెడ్డి, శ్రీపతి రాజేశ్వరరావులు అలా వెలుగులోకి వచ్చినవారే. ఎన్టీఆర్ తన వివాహానికి హాజరయ్యే దాకా పెళ్లి చేసుకోనని, తన పెళ్లి ముహూర్తాలను వాయిదా వేస్తూ రమేష్‌రెడ్ది నాడు సంచనలంగా మారాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత వీరికి ఎమ్మెల్యే సీట్లిచ్చి, మంత్రులను కూడా చేశాడు.
ఇక ఇటీవల పవన్ ఓ అభిమానితో తానే ఏరికోరి సెల్ఫీదిగాడు.ఇప్పుడు మెగాస్టార్‌చిరంజీవి అభిమాని మరోరకంగా వార్తల్లోకి ఎక్కాడు. చిరంజీవి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, దాని ముందు ఆయన ఫ్యాన్ అయిన ఆకుల భాస్కర్‌రావు వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు మెగాస్టార్‌సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తన ఇంటికి ఆహ్వానించి వారితో కలసి విందు ఆరగించి, నూతన దంపతులకు కొత్త వస్త్రాలను బహూకరించాడు. దాంతో ఆ అభిమాని ఎంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఆ తర్వాత ఈ దంపతులు రామ్‌చరణ్ నటిస్తున్న 'రంగస్థలం' సెట్లో చరణ్‌ని కలిసి ముచ్చటించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.