Advertisement
Google Ads BL

నయనతార సోలోగా కొట్టింది హిట్..!


సౌత్ హీరోయిన్స్ అందరిలో నయనతారదే పై చేయి. అటు సీనియర్ హీరోలతోనూ... ఇటు యంగ్ స్టార్స్ తోనూ జోడి కడుతూనే... మరో పక్కన లేడి ఓరియెంటెడ్ సినిమాలతో కూడా దున్నేస్తుంది. అటు తమిళం.. ఇటు తెలుగు రెండు భాషల్లోనూ నయనతార టాప్ గేర్ లో దూసుకుపోతుంది. ఇక్కడ చిరంజీవి సరసన 'సై రా నరసింహారెడ్డి' లో పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్న నయనతార... మరో సీనియర్ హీరో బాలకృష్ణ సరసన కూడా 'జై సింహా'లో అదరగొడుతుంది. ఇపుడు తాజాగా కోలీవుడ్ లో నయనతార నటించిన లేడి ఓరియెంటెడ్  సినిమా ‘ఆరమ్’ గత శుక్రవారమే విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Advertisement
CJ Advs

టాప్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దడదడ లాడిస్తున్న నయనతార నటించిన ‘ఆరమ్’ సినిమా తమిళంలో మంచి అంచనాలతోనే విడుదలైంది. ఈ సినిమాలో నయనతార కలెక్టర్ పాత్రలో నటించి ఇరగదీసింది. ఈ సినిమా విడుదలైన మొదటి షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకుని... విమర్శకుల ప్రశంసలు పొందింది. క్రిటిక్స్ కూడా ఈ సినిమాకి అదిరిపోయే రేటింగ్స్, మంచి రివ్యూలు ఇచ్చారు. ఒక కొత్త దర్శకుడు గోపీ నైనార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘ఆరమ్’ సినిమా మొత్తం ఒక సామాజిక సమస్య నేపథ్యంలోనే సాగుతుంది. ఈ సినిమాలో నయనతార పెరఫార్మెన్స్ కి మాత్రం అదిరిపోయే ప్రశంసలు దక్కుతున్నాయి. 

ఇక కోలీవుడ్ లో ఈ శుక్రవారం విడుదలైన ‘ఆరమ్’ చిత్రం ఇక్కడ టాలీవుడ్ లోను 'కర్తవ్యం' పేరుతో త్వరలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Aramm Receives Positive reviews From Critics:

Hit Talk to Nayanthara Aramm Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs