Advertisement
Google Ads BL

ప్రభాస్ 'సాహో' లేటెస్ట్ అప్డేట్..!


 

Advertisement
CJ Advs

బాహుబలి ప్రభాస్... సుజిత్ దర్శకత్వంలో ప్రస్తుతం 'సాహో' షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే 'సాహో' కోసం దుబాయ్ లో హై ఇంటెన్స్ తో కూడుకున్న చేసింగ్ సీన్స్ లో పాల్గొంటున్నాడు. ఎటువంటి డూప్ లేకుండా ప్రభాస్ ఈ యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నాడు.  అయితే ఈ షెడ్యూల్ తర్వాత 'సాహో' సినిమాలో మరో కీలకమైన యాక్షన్ సీన్స్ ని షూట్ చేయించడానికి ప్రభాస్ హాలీవుడ్ కి వెళ్లనున్నాడని సమాచారం. అక్కడ చిత్ర బృందం కొన్ని భారీ యాక్షన్ సీన్స్ తో పాటు ఛేజింగ్ సీన్స్ ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. 

అయితే అక్కడ హాలీవుడ్ లో ప్రముఖ హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్ అయిన కెన్నీ బెట్స్ నేతృత్వంలో ఆ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.  ఈ స్టంట్స్ మాస్టర్ ముందుగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ ని గమనించి ఏం చేయగలడు అనే విషయంపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే.... ప్రభాస్ కి సెట్ అయ్యే విధంగా ఈ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నాడట. మూడువారాల పాటు ప్రభాస్ అక్కడ హాలీవుడ్ లోనే గడపనున్నాడని తెలుస్తోంది. ఇకపొతే ఈ హాలీవుడ్ యాక్షన్ సీన్స్ కోసం ప్రస్తుతం దుబాయ్ లో దర్శకుడు సుజీత్ 'సాహో' షూటింగ్ ని త్వరత్వరగా పూర్తి చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ అయిపోగానే వెంటనే నెక్స్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తారట. 

బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ విలన్ గా నటిస్తున్నాడు.

Saaho Movie Latest Update:

Sahoo Action Sequences Shoot At Dubai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs