Advertisement
Google Ads BL

మహేష్‌ ముందే స్పందిస్తే ఇంకోలా ఉండేది..!


ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్‌ హీరోగా నటించిన 'పీఎస్వీ గరుడవేగ' చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. హాలీవుడ్‌ రేంజ్‌లో రూపొందిన ఈ చిత్రంపై సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ రాజశేఖర్‌ కమ్‌ బ్యాక్‌ మూవీగా అభివర్ణిస్తున్నారు. ఇక ఈ చిత్రం చూసిన మహేష్‌బాబు తమకి ఫోన్‌ చేసి అభినందించినట్లు నటి జీవిత సక్సెస్‌ మీట్‌లో తెలిపింది. తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు బహిరంగంగానే 'పీఎస్వీ గరుడవేగ'పై ట్విట్టర్‌లో పొగడ్తల వర్షం కురిపించాడు. 

Advertisement
CJ Advs

ఆయన ట్వీట్‌ చేస్తూ...గొప్ప స్క్రిప్ట్‌.. అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లు, ఓవరాల్‌గా గరుడవేగ స్టన్నింగ్‌. టీం సభ్యుల కృషి అద్భుతం. రాజశేఖర్‌గారికి, ప్రవీణ్‌సత్తార్‌ గారికి నా శుభాకాంక్షలు అని ట్వీట్‌ చేశాడు. దీనికి ప్రతిగా రాజశేఖర్‌ 'థాంక్యూ సోమచ్‌ డియర్‌ మహేష్‌....మా కృషిని అభినందించడానికి కాస్త సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు' అని తెలిపాడు. ఇక మహేష్‌ ఆలస్యంగా స్పందించాడని, అదే సినిమా ఫస్ట్‌ వీకెండ్‌లోపు ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే సినిమాకి ప్రమోషన్‌గా ఉపయోగపడి మరిన్ని కలెక్షన్లు వచ్చేవని అంటున్నారు. 

ఈ వారం నాలుగు సినిమాలు రిలీజ్‌కావడం, యాక్షన్‌ చిత్రం కావడంతో మహిళా ప్రేక్షకులు తక్కువగా ఆదరిస్తుండటంతో 'పీఎస్వీ గరుడవేగ' చిత్రం కలెక్షన్లు నెమ్మదించాయి. ఇక గత ఆదివారమే సినిమాని చూస్తానని చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రం చూసిన తర్వాత ఎలాంటి కామెంట్స్‌ చేయకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని, అనుమానాలను రేకెత్తిస్తోంది...! 

Mahesh Showers Praises on PSV Garuda Vega:

Prince Mahesh Babu joins the list of admirers of PSV Garuda Vega.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs