Advertisement
Google Ads BL

కోట గట్టిగానే ఇచ్చాడు..!


ఇంతకు ముందు వేణుమాధవ్‌ నుంచి ఎందరినో బతికుండగానే చాలామంది సోషల్‌మీడియాలో చంపేశారు. ఇటీవల ఎస్పీబాబు, సుశీల అనారోగ్యంపై కూడా పుకార్లు రావడంతో వారే మీడియా మందుకు వచ్చి, లేదా సోషల్‌మీడియా ద్వారా తాము బాగున్నామని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక తాజాగా కోటశ్రీనివాసరావు ఆరోగ్యం బాగాలేదని, హార్ట్‌ప్రాబ్లమ్‌తో పాటు ఆయన డయాబెటిస్‌., ఊపిరితిత్తులు బాగాలేవని, డాక్టర్లు నడవద్దని చెబుతున్నా ఆయన నడుస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై కోట తీవ్ర ఆగ్రహంతో పాటు ఆవేదనను కూడా వ్యక్తపరిచాడు. 

Advertisement
CJ Advs

ఎవరో తెలిసిన వారు హాస్పిటల్‌లో ఉంటే చూడటానికి నాలుగైదు సార్లు వెళ్లితే, ఆయనకు ఆరోగ్యం బాగా లేదు. అందుకే హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగుతున్నాడని అంటున్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే నన్నే డైరెక్ట్‌గా ఆరోగ్యం ఎలా ఉంది? అని అడగండి. అంతేగానీ కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులకు ఆందోళన కలిగించేలా ప్రచారాలు చేయవద్దు. నాకు74 ఏళ్ల వయసు. మరి ఈ వయసులో కాళ్లనొప్పలు, కీళ్లనొప్పులు ఉండవా? నాకు డయాబెటిస్‌ రాకూడదా..?దాంతో నన్ను పరామర్శించడానికి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. 70ఏళ్లు వచ్చినా పాడగలగడం నా అదృష్టం అని బాలూగారు చెబుతూ ఉంటారు. నాకు 74ఏళ్లు వచ్చినా నటించే ఓపికి ఇచ్చినందుకు దేవుడికి దణ్ణం పెట్టుకుంటాను. 

ఇక ఈ మధ్య ఎక్కువ చిత్రాలు చేయడం లేదు. నేడున్న హీరోలందరి వయసు 25ఏళ్ల వారే. వారికి తండ్రిగా నేను సూట్‌ కాను కదా...! ప్రస్తుతం 'బాలకృష్ణుడు, ఆచారి అమెరికా యాత్ర' తమిళంలో 'సామి 2' చిత్రాలలో నటిస్తున్నాను. ఇప్పటికీ నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇలాంటి వార్తలతో అందరిలో ఆందోళన పెంచవద్దని ఆయన కోరారు.

Kota Srinivasa Rao Condemns Gossips on His Health Condition:

Senior top character artist Kota Srinivasa Rao turned out to be the latest victim of such fake news.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs