ప్రస్తుతం పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో పీఎస్‌పీకే 25 చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ మంచి స్పందనను రాబడుతోంది. కాగా ఇందులో కీర్తిసురేష్, అనుఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీర్తిసురేష్ ఎక్స్‌పోజింగ్ చేయదు కనుక ఈచిత్రంలో ఆ బాధ్యతను అను తన భుజాలపై వేసుకుందని ఇటీవల లీకైన ఫోటోలు నిరూపిస్తున్నాయి.
కీర్తి ఏమాత్రం ఇబ్బందులు లేకుండా తన పని వరకు తాను చేసుకుంటూ పోతుండటంతో ఇప్పటికే టాప్‌హీరోయిన్ రేసులో ఉన్న అను ఇమ్మాన్యుయేల్ ప్రతి విషయంలోనూ దూసుకుని పోతూ తనవంతు ప్రమోషన్స్‌ని నిర్వర్తిస్తోంది. ఇక పవన్ అంటే పవర్ అని ఆమె తాజాగా వ్యాఖ్యానించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పవన్ కారులో వెళ్తున్న ఫొటోని పోస్ట్ చేసింది. కారులో ముందు సీట్లో కూర్చున్న పవన్‌ని వెనుక సీటు నుంచి తీసిన ఫొటోఇది. ఇందులో పవన్ కళ్లు ఎంతో ఆకర్షణీయంగా కారు అద్దాలలో కనిపిస్తూ ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
'బైటికొచ్చి చూస్తే' పాట లిరికల్ వీడియో త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్‌డే సందర్భంగా విడుదలైంది. త్వరలో మరో రెండు సాంగ్స్‌ని విడుదల చేసి ఎట్టకేలకు డిసెంబర్ 14న భారీగా ఆడియో వేడుక నిర్వహించనున్నారు. ఇక ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.