Advertisement
Google Ads BL

తమ్మారెడ్డి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు!


కులాలను, మతాలను, శృంగారాన్ని, ఇతర విదేశీ సంప్రదాయాలను చూపించడం ద్వారా సినిమా వారు పలువురిలో పరువు పోగొట్టుకుంటున్నారు. ఇక అదే సమయంలో తమకు నచ్చిన విధంగా, చివరకు దివ్యాంగులు, మహిళలు, పిల్లలను కూడా తమ చెత్త సీన్స్‌, డైలాగ్స్‌తో వినోదం రూపంలో అందిస్తూ సమాజంపై పెను ప్రభావం చూపుతున్నారు. మరోపక్క తమకు స్వేచ్చ ఉంది కదా.. అని ఇష్టం వచ్చిన చిత్రాలు తీస్తున్నారు. దానికి ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతి, వీరగంధంతో పాటు రామసత్యనారాయణ వంటి వారు కూడా ఎన్టీఆర్‌ చిత్రాలపై కన్నేసి ఎవరికి వారు మా కోణంలో మేము తీస్తామని వితండ వాదన చేస్తున్నారు. మరికొందరు ఏకంగా పబ్లిసిటీ కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారు. మరోవైపు రాజకీయాల నాయకులు తమ కులం, వర్గం వారిని కాస్త తేడాగా చూపించినా కూడా సెన్సార్‌బోర్డ్‌ ఇచ్చిన సర్టిఫికేట్‌ని కూడా కాదని, తమ మతోన్మాదం, కులరంగులు పులుముతున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా మద్యప్రదేశ్‌కి చెందిన ఎంపీ చింతామణి మాలవీయ 'పద్మావతి' చిత్రం తీస్తున్న సంజయ్‌లీలా భన్సాలీపై మండిపడుతూ, సినిమా కుటుంబాలలోని మహిళలు రోజుకో మొగుడిని చూసుకుంటారు. దుష్టమనస్తత్వాలతో నన్ను విసిగించే వారిని చెప్పుతో కొడతాను... అనే వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఎవరినైనా అనదలుచుకుంటే ఆ వ్యక్తినే నేరుగా అనాలని, కానీ సినిమా వారినందరికీ వర్తించేలా ఆయన ఎలా మాట్లాడుతాడు? సినిమా వారి భార్యలంటే అంత చులకనా? మరి బిజెపి నాయకులలో ఎందరు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు. 

వారి పేర్లు చెప్పడానికి నాకుసంస్కారం అడ్డం వస్తోంది. తనకు చికాకుతెచ్చే వారిని చెప్పుతో కొడతాను.... అనే వ్యాఖ్యలపై మేమంతా ఒకటైతే నిన్ను కూడా చెప్పుతో కొట్టగలం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దు. అధికారంలో ఉంటే అంత పొగరుగా ఉండాలా? పదవిలో ఉన్నామని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.. అంటూ ఆయన చింతామణి మాలవీయాపై తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు. 

Tammareddy Bharadwaj Warns BJP MP Chintamani Malaviya:

Tammareddy said, if Malavia crosses his limits we will teach him a fitting lesson. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs