Advertisement
Google Ads BL

'అర్జున్ రెడ్డి' .. 'వర్మ' గా మారితే..?


వాస్తవానికి కొందరి వ్యక్తిగత జీవితాలను నిశితంగా గమనిస్తే వారి జీవితాలు సినిమాలలోని పాత్రలకు మార్గదర్శకంగా ఉంటాయి. నిజజీవితంలోని వ్యక్తుల ప్రవర్తనే కొన్ని చిత్రాలకు స్ఫూర్తి అవుతుంది. అలాంటి వారిలో రాంగోపాల్‌ వర్మ ఒకరు. ఆయన బిహేవియర్‌తో ఎన్ని పాత్రలనైనా మలచవచ్చు. కాగా తెలుగులో విజయ్‌దేవరకొండ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో బోల్ట్‌కంటెంట్‌తో 'అర్జున్‌రెడ్డి' అనే చిత్రం వచ్చి సంచలనాలను సృష్టించింది. నిజానికి ఈ చిత్రానికి 'అర్జున్‌రెడ్డి' అనే టైటిల్‌ కంటే 'వర్మ' అనే టైటిలే కరెక్ట్‌గా సూటవుతుంది. ఆయనకు కూడా ఈ చిత్రం బాగా నచ్చి ప్రమోషన్‌ కూడా చేశాడు కాబట్టి ఆయన బిహేవియర్‌, ఆయన అభిరుచికి తగ్గట్లుగా ఆయన పేరే పెట్టిఉండాల్సింది. 

Advertisement
CJ Advs

ఇక ఈ తెలుగు చిత్రానికి ఆయన పేరు పెట్టకపోయినా ఈ చిత్రం తమిళ రీమేక్‌కి మాత్రం 'వర్మ' అనే టైటిల్‌నే పెట్టారు. తెలుగువారికి తెలిసినంతగా తమిళులకు వర్మ పేరు తెలియకపోయినా ఆయన పేరును, శశికళ చిత్రం అనౌన్స్‌మెంట్‌, తమిళనాడు రాజకీయాలపై ఆయన చేసిన కామెంట్స్‌ ద్వారా ఆయనకు అక్కడ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆయన తీసిన తెలుగు చిత్రాలే కాదు.. బాలీవుడ్‌ చిత్రాలు సైతం తమిళంలో విడుదలయ్యాయి. దాంతో బాల దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్‌ కుమారుడు దృవ్‌ హీరోగా పరిచయం అవుతోన్న ఈచిత్రానికి 'వర్మ' అనే టైటిల్‌ని పెట్టారు. 

ఇక బాల దర్శకత్వంలో వచ్చిన 'శివపుత్రుడు' ద్వారానే విక్రమ్‌కి పేరొచ్చి చియాన్‌గా అవతరించాడు. ఆ చిత్రం కూడా నేపధ్యం వేరైనా అది కూడా బోల్డ్‌ కంటెంట్‌ తరహా చిత్రమేనని చెప్పాలి. దీంతో ఈ చిత్రానికి మొదట 'చియాన్‌' అనే టైటిల్‌ని పెడతారని వార్తలు వచ్చాయి. కానీ బాల మాత్రం 'వర్మ' టైటిల్‌వైపే ఆసక్తి చూపడం విశేషం.

Arjun Reddy Tamil Remake Title is Varma:

Varma Title for the Vijay Devarakonda Arjun Reddy Tamil Remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs