Advertisement
Google Ads BL

సింగర్ సునీతని వేధించింది ఎవరు?


సింగర్‌గా, యాంకర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మంచి పేరున్న అందమైన కోకిల సునీత అనిచెప్పాలి. ఆమె చేత వెండితెరపై కూడా వేషాలు వేయించాలని ఎందరో భావించారు. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు. తాజాగా ఈమె తన కూతురు, కొడుకుతో కలిసి ఓ ఫొటో తీయించుకుంది. ఇందులోని ఆమె పిల్లలను చూసిన వారు వారికి నీవు అక్కలా ఉన్నావు గానీ అమ్మగా లేవని ప్రశంసలు కురిపించారు. 

Advertisement
CJ Advs

ఇక ఆమెకు కూడా ఇండస్ట్రీలో ఎవరి నుంచైనా వేధింపులు మొదలయ్యాయా? అని ప్రశ్నిస్తే.. నా పట్ల కూడా మిస్‌బిహేవ్‌ చేసిన వారు ఉన్నారు. అలాంటి వారు ప్రపంచంలో ప్రతి చోటా ఉంటారు. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అక్కడ ఉండేందుకు అసలు ఇష్టపడేదాన్నే కాదు. ఎస్‌ అనిచెప్పకుండా.. నో అని చెప్పకుండా అలా బిహేవ్‌ చేసిన వారిని కంప్లీట్‌గా కట్‌ చేసేదాన్ని, దాంతో వాళ్ల ఇగోలు హర్ట్‌ అయ్యేవి. దాంతో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాను. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. అయితే మ్యూజిక్‌ ఇండస్ట్రీలో మాత్రం అలాంటి ఘటనలు ఎదురుకాలేదు. నేను కష్టతరమైన ప్రయాణం చేస్తున్నాను. నా మంచి కోరుకునే వారు... నా బాగుని కోరుకునే వారు.. నా అభిమానుల ఆశీస్సులు లేకపోతే ఏమైపోయేదానినో... ఎలా ఉండేదాన్నో అని కన్నీరు పెట్టుకుంది.

పెద్దగా కష్టాలు అనుభవించింది ఏమీ లేదు గానీ, మానసికంగా మాత్రం నేను బాగా దెబ్బతిన్నాను. ఇల్లు కూలిపోతే మరలా కట్టుకోవచ్చు. కానీ మనసుకి దెబ్బతగిలితే మాత్రం కోలుకోవడం చాలా కష్టం. నేను పెట్టుకున్న నమ్మకాలన్నీ వమ్ము కావడంతో ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను. ఇక 'అలా అట కదా..! ఇలా అట కదా! అని మాట్లాడుకునే వారిని చూసి ఇండస్ట్రీ నుంచి నేను వెళ్లిపోతేనైనా వారు సంతోషపడతారని భావించేదానిని. అలా అనుకున్న మరుక్షణం నా పరిస్థితులు నాకు గుర్తొస్తాయ్‌...నాకు ఇండస్ట్రీ తప్ప ఏమీ తెలీదు. కానీ రిసెప్షనిస్ట్‌గా అయినా జాబ్‌ ఇస్తారు. కానీ ఆ డబ్బులతో నా జీవితం గడపడం సాధ్యమయ్యే పనికాదు'.. అంటూ ఉద్వేగానికి లోనైంది. 

Singer Sunitha Reveals Tough Times of Her Life!:

Singer Sunitha on Her Life Journey
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs