మన స్టార్స్ వరుసగా నిర్మాతల అవతారం ఎత్తుతున్నారు. పవన్‌కళ్యాణ్ పవన్ క్రియేటివ్ వర్క్స్ అంటుంటే, మహేష్‌బాబు ఎంబి బేనర్‌ని పెట్టుకున్నాడు. ఇక ఎన్టీఆర్‌కి ఆయన అన్నయ్యకి చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ ఉంది. మరోవైపు గీతాఆర్ట్స్, గీతాఆర్ట్స్ 2, వి4 బేనర్లు చాలక రామ్‌చరణ్ తన స్వంత బేనర్‌గా 'కొణిదెల' బేనర్‌ని స్థాపించాడు. మరోవైపు ప్రభాస్‌కి తన పెదనాన్న గోపీకృష్ణ బేనర్‌తో పాటు యువి క్రియేషన్స్ కూడా ఉంది. ఇక అల్లుఅర్జున్, నాగార్జున, వెంకటేష్, త్వరలో బాలయ్య.. ఇలా అందరూ అదే దారిలో ఉన్నారు. తమకున్న క్రేజ్‌ని వేరే నిర్మాతలకు ఇవ్వకుండా తమ బేనర్‌లోనే చిత్రాలు చేస్తూ షేర్స్, రైట్స్ తీసుకుంటున్నారు. ఇక పవన్‌కి, మహేష్‌కి సొంత బేనర్లు కలిసి రాకపోవడంంతో వారు సైలెంట్ పార్ట్‌నర్స్ అవతారం ఎత్తుతున్నారు. మరి వెంకటేష్‌తో పాటు మరికొందరు హీరోలు చిత్ర నిర్మాణమంతా ఇతర భాగస్వామ్య బేనర్ల చేత పెట్టిస్తూ, తమ బేనర్ పేరుని వాడుకుని లాభాలలో వాటా తీసుకుంటున్నారు.
తెలుగులో ఇది చిరంజీవి హయాంలో నుంచి సాగుతోంది. ఆయనతో చిత్రాలు తీయడానికి రెడీగా పది మంది దాకా ఎప్పుడు క్యూలో ఉండేవారు. దాంతో ఆయన ఇద్దరు ముగ్గురు నిర్మాతలను కలిపి ఓ చిత్రం చేసేశాడు. తన పారితోషికంగా నైజాం ఏరియాను తీసుకునేవాడు. నాడు చిరంజీవికి నైజాంలో ఏడెనిమిది కోట్ల మార్కెట్ ఉండేది. అంటే ఆయన 15ఏళ్ల కిందటే ఏడెనిమిదికోట్లు తీసుకున్నట్లు లెక్క. ఇప్పుడు సాయికొర్రపాటిని కలుపుకోవడం ద్వారా బాలయ్య, 'బాహుబలి' క్రేజ్‌ని వదులుకోకూడని ప్రభాస్ వరుసగా యువి క్రియేషన్స్‌లో రెండు చిత్రాలు చేస్తున్నాడు.
ఇక మహేష్ విషయానికి వస్తే తన తండ్రికి పద్మాలయా, సోదరుడు రమేష్‌బాబుకి కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్, సోదరి మంజులకు ఇందిరా ప్రొడక్షన్స్ .. ఇలా ఉన్నాయి. తాజాగా పవన్, త్రివిక్రమ్‌లు కూడా హారిక అండ్ హాసినిలో భాగస్వామ్యం అయ్యారని సమాచారం. ఇక త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేసే చిత్రానికి కూడా ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా రైట్స్, ప్లస్ షేర్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ విధంగా స్టార్ హీరోలు ఆడిందే ఆట పాడిందే పాటగా మారడంతో బయ్యర్లు బిక్కచచ్చిపోతున్నారనేది వాస్తవం.