Advertisement
Google Ads BL

'బాలకృష్ణుడు'లో మ్యాటర్ వున్నట్లే వుంది..!


'బాలకృష్ణుడు'లో మ్యాటర్ వున్నట్లే వుంది..!

Advertisement
CJ Advs

టాలీవుడ్ లో పెద్ద హీరోస్ కాకుండా మీడియం రేంజ్ హీరోస్ గురించి మాట్లాడాలంటే మనకి మొదట గుర్తొచ్చే పేరు నారా రోహిత్. హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు మీద సినిమాలు తీసుకుంటూ బిజీ అయ్యాడు.

నారా రోహిత్ ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ కానీ, మంచి కాన్సెప్ట్ కానీ ఉండేలా చూసుకుంటుంటాడు. కథలో రాజకుమారి సినిమా తర్వాత రోహిత్ సినిమా ఏది రిలీజ్ అవ్వలేదు. ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రం బాలకృష్ణుడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా వుంది. పవన్ మల్లెల అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు రోహిత్. రోహిత్ సరసన రెజినా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఒక ప్రముఖ పాత్రలో నటించింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మణీశర్మ సంగీతం అందించారు. బాలకృష్ణుడు  ట్రైలర్ ని ఆడియో లాంచ్ కార్యక్రమంలో విడుదల చేశారు. 

రోహిత్ ఇప్పటివరకు చెప్పుకోటానికి ఒక్క కమర్షియల్ సినిమా కూడా తియ్యలేదు. కానీ బాలకృష్ణుడు సినిమా ట్రైలర్ చూస్తుంటే కమర్షియల్ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. ఈ సినిమాలో సినిమాకి కావాల్సిన అన్ని హంగులు వున్నాయి..యాక్షన్, కామెడీ, ఫైట్స్, రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ అన్ని వున్నాయి. అయితే ఈ సినిమాలో శివగామి... అదేనండి రమ్య కృష్ణ  రోహిత్ కి విలన్ గా కనిపించనుంది. అలాగే హీరోయిన్ రెజీనా కూడా అందాల ఆరబోతలో రెచ్చిపోయింది. ఇకపోతే బాలకృష్ణుడు సినిమా ఫస్ట్ లుక్ నుండి నారా రోహిత్ సిక్స్ ప్యాక్ బాడీలో కనబడతాడని... అందుకోసమే వెయిట్ తగ్గే ప్రాసెస్ లో జిమ్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడని అన్నారు. కానీ ఈ బాలకృష్ణుడు ట్రైలర్ లో రోహిత్ ఎప్పటిలాగే లావుగానే కనబడ్డాడు. ఎక్కడా ఫస్ట్ లుక్ లో చూపించినట్లుగా సన్నగా.. మాత్రం రోహిత్ లుక్ లేదు. ఇక సినిమాలో ఎమన్నా రోహిత్ సన్నగా సిక్స్ ప్యాక్ బాడీలో కనబడతాడేమో చూద్దాం.

ఇక ఓవరాల్ గా బాలకృష్ణుడు ట్రైలర్ పర్లేదు అనిపించింది. ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉంటాడో చెప్పటం కష్టం కనుక సినిమా రిలీజ్ అయ్యే దాక ఆగక తప్పదు. వరస ప్లాప్స్ తో వున్న రోహిత్ కి ఈ సినిమా అయిన హిట్ అందిస్తుందో లేదో కొద్దిగా వెయిట్ చెయ్యాల్సిందే.

Click Here To See The Trailer

Balakrishnudu Movie Trailer and Audio Released:

Balakrishnudu Movie Trailer Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs