Advertisement
Google Ads BL

వారి లక్‌ సరే.. నీ లక్కు సంగతేంటి!


 

Advertisement
CJ Advs

పాతకాలంలో శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, విజయశాంతి.. ఇలా అందరూ హీరో చంద్రమోహన్‌ సరసన నటించిన తర్వాత స్టార్స్‌గా మారారు. దాంతో ఆయనను అందరూ గోల్డెన్‌లెగ్‌గా చెప్పుకుని, కొత్త హీరోయిన్లు కూడా ఆయనతో చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపించేవారు. కానీ చంద్రమోహన్‌ తనతో నటించిన హీరోయిన్లకు స్టార్‌డమ్‌ ఇవ్వడమే కాదు.. ఆయన కూడా వరుస విజయాలతో దూసుకుని పోయేవారు. తాజాగా సందీప్‌కిషన్‌ విషయంలో కూడా పలువురు ఆయన్ను చంద్రమోహన్‌తో పోలుస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్‌, రాఖిఖన్నా, రెజీనా.. వీరంతా సందీప్‌కిషన్‌తో చిత్రాలు చేసిన తర్వాతనే వారి కెరీర్స్‌ సూపర్‌జెట్‌ స్పీడ్‌తో సాగుతున్నాయి. వీరు దాదాపుగా స్టార్‌ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. కానీ రకుల్‌ప్రీత్‌సింగ్‌తో ఆయన నటించిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తప్ప మిగిలిన ఏ హీరోయిన్‌తో ఆయనకు హిట్‌ లేదు. మరి చంద్రమోహన్‌లాగా కేవలం హీరోయిన్లకు స్టార్‌డమ్‌ తెస్తున్నానని సంతోషించక తాను కూడా సక్సెస్‌లు సాధించేలా ఈ యువ హీరో కెరీర్‌ని ప్లానింగ్‌ చేసుకోవాల్సివుంది..! 

ఇక ఇదే విషయమై సందీప్‌కిషన్‌ని ప్రశ్నించగా, ఆ హీరోయిన్లలందరూ బాగా జెన్యూన్‌గా హార్డ్‌ వర్క్‌ చేశారు కాబట్టే వారి స్థాయిని పెంచుకోగలిగారు. వారు స్టార్స్‌ కావడానికి నా సెంటిమెంటే కారణమంటే ఒప్పుకోను. ఒకవేళ అదే నిజమైతే సంతోషమే కదా...! అని సమాధానం ఇచ్చాడు. అయినా సినిమా ఇండస్ట్రీలో ఒక్క హార్డ్‌వర్క్‌ ఉంటేనే సరిపోదని, దానికి లక్‌ కూడా కలిసిరావాలనేది సందీప్‌కిషన్‌కి స్వయంగా తెలుసు. ఎందుకంటే ఆయన ఎంతో హార్డ్‌ వర్క్‌ చేస్తున్నా ఆయనకు సరైన బ్రేక్‌ రావడం లేదు. తాజాగా విడుదలైన  'కేరాఫ్‌ సూర్య' పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

Sundeep Kishan about His Heroines:

Sundeop Kishan Another Chandramoan list
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs