Advertisement
Google Ads BL

సినిమా చూశాక స్పందనేది రాజమౌళి..?


బాహుబలి సినిమాతో సూపర్ స్టార్ డైరెక్టర్ గా అవతరించిన రాజమౌళి.... సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సినిమా మీద సోషల్ మీడియాలో పొగిడాడు అంటే... ఆ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుందని ఆయా సినిమాల డైరెక్టర్స్, నటీనటులు గాలిలో తేలిపోతుంటారు. అయితే ఒకప్పుడు రాజమౌళి చేసిన ట్వీట్స్ చూసి సినిమాకెళ్లిన ప్రేక్షకుడు థియేటర్ నుండి తృప్తిగా బయటకి వచ్చేవాడు. కానీ రాను రాను రాజమౌళి ఆయన సన్నిహితుల కోసం సినిమా విజయం సాధించినా సాధించకపోయినా కూడా సినిమా సూపర్ అంటూ ట్వీట్స్ చేసేసి నలుగురిలో నవ్వుల పాలవుతున్నాడు. అయినా కూడా రాజమౌళి చేసే ట్వీట్ కోసం ఎదురు చూసే అభిమానులు చాలామందే ఉన్నారు.

Advertisement
CJ Advs

ఇక విషయంలోకి వస్తే... రాజమౌళి గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజశేఖర్ 'పి ఎస్ వి గరుడవేగ' సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవడంతో... పి ఎస్ వి టీమ్ కి విషెస్ చెప్పడమే కాదు... ఈ ఆదివారమే పి ఎస్ వి చూడడానికి టికెట్స్ బుక్ చేసుకున్నానని ట్వీట్ చేశాడు. అయితే రాజమౌళి ఆదివారం గరుడవేగని రాజమౌళి చూసాడా? లేదా? అనే దాని మీద ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో గరుడవేగ ఉందని సెలబ్రిటీస్ అందరూ గరుడవేగని ఆకాశానికెత్తేస్తుంటే... రాజమౌళి మాత్రం సినిమా చూసి కూడా కామ్ గా వున్నాడు.... అంటే ఈ సినిమా దర్శక ధీరుడికి నచ్చలేదా? అనే డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు సదరు చర్చా రాయుళ్లు.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే రాజమౌళి.... ఇలా గరుడవేగ విషయంలో స్పందిచకపోవడంపై పలు విమర్శలు వినబడుతున్నాయి. మరి ఈ విమర్శలకు ట్విట్టర్ సాక్షిగా రాజమౌళి క్లారిటీ ఇస్తాడో లేదంటే సైలెంట్ గా ఉంటాడో చూద్దాం.

After Watching PSV Garuda Vega, Rajamouli No Reaction:

Rajamouli No Tweet after Psv Garuda vega movie Watch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs