జూలీ-2లో హాట్ సీన్స్ తీసేయలేదు: రాయ్ లక్ష్మీ!


బాలీవుడ్ లో, కోలీవుడ్ లో సినిమాలకు సెన్సార్ విషయంలో చాలా తేడాలున్నాయి. బాలీవుడ్ లో బోల్డ్ సీన్స్ ను అంతగా పాటించుకోరు, అదే తమిళంలో  అయితే కొద్దిగా  హాట్ అనిపించినా బ్లర్ వేయడానికి రెడీగా ఉంటారు ఇక్కడి సెన్సార్ బృందం. అయితే ఇప్పుడు రాయ్ లక్ష్మి జూలీ-2 సినిమాకు తమిళ సెన్సార్ బోర్డు చాలా కట్స్ వేసిందని తెలుస్తుంది. దీంతో స్వయంగా రాయ్ లక్ష్మీ స్పందించింది.

హిందీ, తమిళ్ లో ఒకేసారి విడుదల అవుతున్న జూలీ-2 సినిమాకు సంబంధించి సెన్సార్ విషయంలో ఎలాంటి తేడాలు లేవంటోంది లక్ష్మీరాయ్. బాలీవుడ్ లో కొన్ని సీన్స్ ఎలా ఉన్నాయో అదేవిధంగా తమిళ్ లో కూడా ఉంటాయి అని గట్టిగా చెప్పింది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా తను నటించిన ఎన్నో సన్నివేశాలు సెన్సార్ అధికారులకు కూడా నచ్చాయంటోంది రాయ్ లక్ష్మీ.

అయితే చాలామంది వాటిని ఘాటు సీన్స్ అనుకుంటున్నారు కానీ.. సినిమా చూస్తే ఆ సీన్స్ వెనుక సారాంశం దాగుందని... దాన్ని మీరు అర్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చింది. ఇలా ఎక్సపోజ్ చేసి ఆ సీన్స్ ని ఆలా చూడొద్దని స్టేట్ మెంట్స్ ఇవ్వటం ఇప్పుడు హీరోయిన్స్ కి కామన్ అయిపోయింది. మరి రాయ్ లక్ష్మీ కూడా అదే చెబుతోంది.

Raai Lakshmi Clarity on Julie 2 Hot Scenes:

Hot Scenes not Deleted in Julie 2 says Raai Lakshmi
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES