Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కి ఇందిరాగాంధీ కనెక్షన్..!


ఎంతో ప్రతిష్టాత్మంగా బాలకృష్ణ సమర్పణలో దర్శకుడు తేజ తెరకెక్కించనున్న చిత్రం 'ఎన్టీఆర్'. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ ప్రకటన ఇవ్వకుండానే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్‌పై ఓ క్లారిటీకి వచ్చాడంట. ఎన్టీఆర్ మూవీతో ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకూడదని బాలయ్య అనుకుంటున్నాడట.

Advertisement
CJ Advs

బాలయ్య ఆలోచనకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మిపార్వతి ఎంట్రీతోనే వివాదాలు మొదలయాయన్న వెర్షన్‌తో డైరెక్టర్ తేజ ఏకీభవించారని.. అందుకే బాలయ్య తియ్యబోయే ఎన్టీఆర్ బయోపిక్ లో లక్ష్మిపార్వతి పాత్ర ఉందని తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా తేజ రాసుకున్న స్క్రిప్ట్ లో నుండి ఓ సీన్ బయటకి వచ్చి మీడియాలో హల్చల్ చేస్తుంది. మూవీ ఓపెనింగ్ షాట్‌కు సంబంధించిన వివరాల్ని ఓ ప్రముఖ న్యూస్‌పేపర్ బయటపెట్టింది. 

'ఇందిరాగాంధీ -  పీవీ నరసింహారావుతో కలిసి కారులో తిరుపతికి వస్తుండగా జరిగిన సంభాషణతో ఎన్టీఆర్ బయోపిక్  మొదలవుతుందట. రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తున్న భారీ సైజు కృష్ణుడు, రాముడి కటౌట్లను చూసి ఇందిరాగాంధీ ఆరా తీయగా అవి దేవుళ్లవి కావు.. ఓ సినిమా నటుడివి చెపుతారంట పీవీ'. దీంతో అవాక్కైన ఇందిర.. ఎన్టీఆర్ గురించి డిటైల్ గా అడిగి తెలుసుకున్న సందర్భాన్ని డైరెక్టర్ తేజ తన సినిమాలో ఈ సీన్ ని ఓపెనింగ్ షాట్‌గా వాడుకుంటున్నట్లు రాసారు న్యూస్‌పేపర్ వాళ్ళు. ఇదే కనక నిజం అయితే సినిమాలో ఓపెనింగ్ షాట్‌ కే జనాలకి పిచ్చెక్కిపోవటం పక్కా అంటున్నారు.

Teja to shoot Indira Gandhi scenes first for NTR Biopic:

NTR Biopic - Indira Gandhi Scenes Shoot First
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs