Advertisement
Google Ads BL

కీర్తి సురేష్ కూడా మొదలెట్టింది..!


త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 25 వ చిత్రం చేస్తున్నాడు. అజ్ఞాతవాసి అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం యూరప్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ ప్రస్తుతం అను ఎమ్మాన్యుయేల్ తో రొమాన్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అను ఇమ్మాన్యుయేల్, పవన్, త్రివిక్రమ్ లు కలిసి సెట్ లో సందడి చేసిన ఫొటోస్ కొన్ని ఇంటర్నెట్ లో లీక్ అయ్యి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ పవన్, అను మధ్య కొన్ని సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ కూడా షూట్ చేయనున్నారు. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ కూడా పవన్ సినిమా కోసం యూరప్ ఫ్లైట్ ఎక్కేసి అక్కడ షూటింగ్ స్పాట్ లో వాలిపోయింది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం కీర్తి సురేష్ 'మహానటి' సావిత్రి బయోపిక్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి 'ఎవడే సుబ్రహ్మణ్యం' డైరెక్టర్ నాగ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఢిల్లీలో భారీ షెడ్యూల్ పూర్తిచేసిన కీర్తి సురేష్, అటు నుండి అటే యూరోప్ బయల్దేరింది. పనిలో పనిగా మధ్యలో మాస్కోలో దిగి షాపింగ్ కూడా చేసేసి త్రివిక్రమ్ సినిమా కోసం బల్గెరియా వచ్చేసింది. ఇక అక్కడ కీర్తి సురేష్, పవన్ తో పాటు చిత్ర బృందం తో కలిసి షూటింగ్ జరిపేస్తూ హడావిడి మొదలెట్టేసింది. అక్కడ కీర్తి సెట్ లో చేసిన హంగామా... దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

ఇక అక్కడ సోఫియా సిటీలో పవన్  -కీర్తిసురేష్ కాంబినేషన్ లో కొన్ని  సన్నివేశాలతో పాటే..... వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ పాట కూడా షూట్ చేయబోతున్నారు. మరి మొన్న అనుతో సందడి చేసిన చిత్ర బృందం ఇప్పుడు కీర్తి సురేష్ తో సందడి చేస్తుందన్నమాట.  ఇకపోతే ఈ విదేశీ షెడ్యూల్ కంప్లీట్ కాగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సినిమాని జనవరి 10 న విడుదల చెయ్యబోతున్నారు.

Keerthi Suresh Posted PSPK25 Shooting Spot Photos:

Heroine Keerthi Suresh Birthday Wishes to Trivikram Srinivas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs