విక్టరీ వెంకటేష్. ఆయన పేరు వినగానే ఫ్యామిలీ, యూత్, లేడీస్, మాస్ ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ ఆయన చిత్రాలు చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. కాగా ఆయన 'సాలా ఖద్దూస్'కి రీమేక్‌గా 'గురు' చిత్రం చేసిన తర్వాత ఇంత లాంగ్ గ్యాప్ ఎప్పుడు తీసుకోలేదు. ఒక చిత్రం షూటింగ్‌లో ఉండగానే మరో చిత్రం లైన్‌లో పెట్టడం ఈయనకి అలవాటు. ఇక ఈయనకు పెద్దగా బర్త్‌డేలను గ్రాండ్‌గా చేసుకునే అలవాటు కూడా లేదు. అజాతశత్రువైన ఆయన బర్త్‌డే డిసెంబర్ 13. కాగా గత కొంతకాలంగా వెంకటేష్ తదుపరి చిత్రం ఈ దర్శకుడితోనేనంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అందులో పూరీ జగన్నాథ్, 'విక్రమ్ వేద' రీమేక్, కిషోర్‌తిరుమల దర్శకత్వంలో 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' వంటివి వినిపించాయి. కానీ ఎట్టకేలకు ఆయన తేజకి ఛాన్స్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థల భాగస్వామ్యంలో రూపొందించనున్నారు. ఇక ఈ చిత్రం వెంకటేష్ బర్త్‌డే కానుకగా డిసెంబర్ 13న ప్రారంభిస్తారని తెలుస్తోంది.
వాస్తవానికి తేజ గతంలో కేవలం మహేష్‌బాబు వంటి స్టార్‌తోనే చిత్రం చేశాడు తప్ప మరో స్టార్‌తో పనిచేయలేదు. మహేష్‌బాబు చిత్రం 'నిజం'కి విమర్శకుల ప్రశంసలు దక్కినా సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయింది. దాంతో బాలయ్యాస్ ఎన్టీఆర్ బయోపిక్ ముందు తేజ వెంకీతో చేసే చిత్రం కీలకంగా మారింది. ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, పొలిటికల్ యాంగిల్ కూడా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో మొదట మెహ్రీన్‌ని, ఆ తర్వాత అనుష్కని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి.
కానీ 'లక్ష్మీకళ్యాణం'తో తన చేతుల మీదుగానే హీరోయిన్‌గా పరిచయం అయి 'నేనే రాజు నేనే మంత్రి' ద్వారా మరలా తను బౌన్స్ బ్యాక్ అయినా వెంకీ చిత్రంలో కూడా తేజ కాజల్‌నే తీసుకోనున్నాడని, సెంటిమెంట్ రీత్యా కూడా ఇది కలసి వచ్చే విషయమని సమాచారం. సో.. వెంకీ తదుపరి చిత్రం వచ్చే ఏడాదిలో గానీ విడుదలయ్యే అవకాశం లేదు. అప్పటివరకు వెంకీ ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే...!