సన్నజాజి లాంటి నడుమగల గోవా సుందరి ఇలియానా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చాలా ఏళ్ళే కొనసాగింది. తర్వాత బాలీవుడ్ మీద ప్రేమతో అక్కడికి చెక్కేసి...అక్కడే తిష్ట వేసింది. ఈ మధ్య కాలంలో అక్కడ కూడా హిట్స్ అందుకుని ఎంజాయ్ చేస్తుంది. అంతేనా బాయ్ ఫ్రెండ్ ఆండ్రుతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. మొన్నీమధ్యనే బాయ్ ఫ్రెండ్ ఆండ్రుని సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్టుగా వార్తలొచ్చాయి. ఎప్పడూ ఫోటో షూట్స్, సినిమాలతో బిజీగా వుండే ఇలియానా ఒకప్పుడు ఆత్మహత్య ఆలోచనలు కూడా చేశానని చెబుతుంది.
తన తనువు చాలించాలని తాను ఒకప్పుడు భావించానని, అసలు నాకలాంటి ఆలోచనలు ఎందుకొచ్చేవో... మొదట్లో అర్ధం కాలేదని... అయితే క్రమంగా తన శరీరంపై తనకున్న అతి ఆలోచనల కారణంగానే ఇలాంటి ఆలోచనలు కలిగేవని చెబుతుంది. అయితే ఇలాంటి ఆలోచనలు తనకు ఎందుకొస్తున్నాయో అనేది అర్ధమయ్యాక వెంటనే డిప్రెషన్ కి ట్రీట్మెంట్ తీసుకున్నానని... నా శరీరాన్ని ఎలా వుందో అలానే సవీకరించడానికి అలవాటు చేసుకోవడం వలెనే... ఇప్పుడు అలాంటి ఆలోచనలు పక్కన పెట్టేశానని కూడా చెబుతుంది.
ఎటువంటి డిప్రెషన్ వున్నా కూడా వెంటనే ట్రీట్మెంట్ అవసరమని.. అంతేకాని నాకెలాంటి ప్రాబ్లెమ్ లేదు అనుకుంటే సరిపోదని కూడా చెబుతున్న ఇలియానాకి ఆత్మహత్య ఆలోచనలతో తాను బాధపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో తన తల్లి తనకు తోడుగా ఉందని... ఆమె మేలు ఎన్నటికీ మర్చిపోలేనిది అని చెబుతుంది.