Advertisement
Google Ads BL

'రంగస్థలం 1985' మరో రికార్డ్..!


సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'రంగస్థలం 1985'. చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా కాబట్టి ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కా పల్లెటూరి యువకుడిలా కనబడుతుండగా... సమంత హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్ - సమంతలు కూడా మొదటి సారి జోడి కట్టడం... సుకుమార్ మేకింగ్ స్టయిల్ పై ఉన్న అంచనాలతో ఈ సినిమా రైట్స్ కి భారీ డిమాండ్ పెరిగింది. ఇప్పటికే తెలుగు శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు కలిపి రికార్డు స్థాయిలో దాదాపు 20 కోట్లకు అమ్ముడయ్యాయి. 

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు తాజాగా 'రంగస్థలం' హిందీ రైట్స్ కూడా మంచి ధరకే అమ్ముడైనట్టుగా సమాచారం అందుతుంది. ప్రముఖ హిందీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్ ఒకటి 10.50 కోట్లకు రంగస్థలం హిందీ రైట్స్ ని కొనుగోలు చేసినట్టుగా టాక్. రామ్ చరణ్ సినిమా కావడం అలాగే 'బాహుబలి' తర్వాత తెలుగు సినిమాలకు బాలీవుడ్‌లో ఆదరణ పెరగడంతో ఇంత పెద్ద మొత్తానికి రైట్స్ అమ్ముడయ్యాయి అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ హీరోగా సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాంకర్ అనసూయ ఒక ముఖ్య పాత్రని పోషిస్తుంది. సుకుమార్ కి ఇష్టమైన దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి మొదట్లో విడుదల చేస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయమై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

Rangasthalam 1985 Hindi Dubbing Rights Record :

Another Recored in Rangasthalam 1985 Movie Account 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs