Advertisement
Google Ads BL

మరో 'ఆది' వస్తున్నాడు..!


'ఆది' అనే పేరుకి తెలుగు ప్రేక్షకులకు ఎంతో లింక్‌ ఉంది. 'ఆది' చిత్రంతోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ స్టార్‌ఇమేజ్‌ని తెచ్చుకున్నాడు. వినాయక్‌ దర్శకునిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆది పేరుతో తెలుగులో ఇప్పుడు ఇద్దరు నటులున్నారు. ఆది సాయికుమార్‌, ఆది పినిశెట్టిలు తెలుగులో రాణిస్తున్నారు. తాజాగా మరో 'ఆది' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అది కూడా మలయాళంలో కావడం విశేషం. తెలుగులో స్టార్‌ తనయులు ఎలా స్టార్స్‌గా రాణిస్తున్నారో చూసి ఇప్పుడు మలయాళ సూపర్‌స్టార్స్‌ కూడా తమ పుత్రరత్నాలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే మలయాళ సూపర్‌స్టార్‌, మలయాళం,తమిళం, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన సల్మాన్‌ దుల్కర్‌ మలయాళంలో పేరు తెచ్చుకుని 'ఓకే కన్మణి' తెలుగులో 'ఓకే బంగారం' ద్వారా తమిళ, తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళ్‌, మలయాళం భాషల్లో రూపొందుతున్న సావిత్రి బయోపిక్‌ 'మహానటి'లో కీర్తిసురేష్‌కి భర్తగా జెమిని గణేషన్‌గా కనిపించనున్నాడు. ఇప్పుడు మరో స్టార్‌ కుమారుడి వంతు వచ్చింది. మలయాళం, తమిళంలోనే గాక తెలుగులో 'గాండీవం, యోధ, జనతాగ్యారేజ్‌, మన్యంపులి, కనుపాప, మనమంతా' వంటి చిత్రాలతో తన కంటూ ఓ క్రేజ్‌ తెచ్చుకున్న మరో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కుమారుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌.. 'ఆది' అనే సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. 

ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలైంది. ఇందులో మోహన్‌లాల్‌లాగా బాగా లావుగా లేకుండా ప్రణవ్‌ బాగా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న జీతూ జోసెఫ్‌ మాట్లాడుతూ, ఇందులో ప్రణవ్‌ సూపర్‌లుక్‌తో కనిపించడమే కాదు.. ఎంతో హ్యాండ్సమ్‌గా ఉన్నాడని తెలిపాడు. ఇక ఈ స్టార్‌ తనయుడు కూడా దుల్కర్‌సల్మాన్‌లా దక్షిణాదిలోని అన్ని భాషల్లో రాణిస్తాడో లేదో చూడాలి...! 

Mohanlal Son Pranav Cine Entry with Aadhi Movie :

Mohanlal Son Grand Entry with Aadhi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs