తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నిత్యం వివాదాలతో వార్తల్లో ఉండే హీరోయిన్ అమలాపాల్. దర్శకుడు విజయ్‌ని వివాహం చేసుకోవడం, వెంటనే విడాకులిచ్చేయడం, ధనుష్‌తో ఎఫైర్ వార్తలు, సుచీలీక్స్‌తో పాటు ఈమె తాజాగా మరో వివాదంలో కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈమె ఈమధ్య పుదుచ్చేరిలో కారుని కొని దానికి 20లక్షల వరకు రోడ్ ట్యాక్స్‌ని ఎగ్గొట్టిన కేసులో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ విచారణకు ఆదేశించింది. ఇక తాను భారతీయురాలినని, తనకు నచ్చిన చోట నివాసం ఉంటాను.. నాకు నచ్చిన చోట కారు కొంటాను? అవి అన్నీ మీకు చెప్పే చేయాలా? అని ఆమె మీడియాపై మండిపడింది. ఇక జీఎస్టీ దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు పుదుచ్చేరిలో కొంటే మీకేం నష్టం? అని వాదించింది.
వాస్తవానికి ఈ విషయాన్ని బయటపెట్టిన పత్రిక మలయాళంలో మంచి పాపులారిటీ ఉన్న 'మాతృభూమి' అనే పత్రిక. 'మాతృభూమి' అని పేరు పెట్టుకుని మరీ ఇలాంటి వివాదాలు సృష్టించడానికి మీకు సిగ్గులేదా? అని ఆమె ఆ పత్రిక యాజమాన్యాన్ని తిట్టింది. అయితే ఆమె తిట్టడంతో పాటు తాను సక్రమంగానే కారు కొన్నట్లు వాటికి ట్యాక్స్‌లు సరిగా కట్టినట్లు ఆమె ఆయా రశీదుల కాపీలను కూడా చూపి ఉంటే నమ్మకం ఉండేది. ఇప్పుడు సమస్య పుదుచ్చేరిలో కారు కొనడం మీద కాదు.. అక్కడ ఆమె తాను నివాసం ఉన్నట్లు నకిలీ అడ్రస్ కాగితాలను చూపించడమే కారణమన్న విషయాన్ని ఆమె దాట వేస్తూ ఏవేవో చెబుతోంది.
ఇక ఈమె తాజాగా తాను మూడు విభిన్న హావభావాలతో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. దానికి తోడు మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన 'మనది అయితే, మనకు వాటిని సొంతం చేసుకుని, సాధించగలిగిన శక్తి ఉంటే కనుక ప్రతి ఒక్కటి మన వద్దకు వస్తుందనే' సూక్తిని జోడించింది. అయినా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలకు ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తుకి ఏమైనా సంబంధం ఉందా? అని పలువురు నెటిజన్లు ఆమెపై నెగటివ్ కామెంట్స్‌తో మండిపడుతున్నారు.