Advertisement
Google Ads BL

అక్కడ హిట్టయింది.. ఇక్కడ పోటీ గట్టిగా ఉంది!


లవర్ బాయ్ గా సిద్ధార్థ్ ఒకప్పుడు తెలుగు తమిళంలో కూడా దూసుకుపోయాడు. అతని సినిమాలకి  రెండు భాషల్లోనూ మంచి మార్కెట్ వుండేది కానీ సమంత తో ఎఫైర్.... బ్రేకప్ విషయాలతో  సిద్దార్ధ్ కెరీర్ లో కూడా చాలానే నష్టపోయాడు. అతని నుండి సినిమాలు రావడం గాని.. వచ్చిన సినిమాలు హిట్ అవడం గాని లేవు. తెలుగులో ఒకప్పుడు సిద్దార్థ్ తో సినిమా తియ్యడానికి క్యూ లు కట్టేవారు దర్శక నిర్మాతలు. అయితే ఇప్పుడు చాలా కాలం తరువాత మళ్ళీ 'గృహం' సినిమాతో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు సిద్దార్థ్ రావల్సింది ఉంది. కానీ ఇక్కడ తెలుగులో థియేటర్స్ కొరత వల్ల సినిమా విడుదల కాలేదు. 

Advertisement
CJ Advs

కానీ తమిళ్ లో మాత్రం 'గృహం' సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. హిట్స్ లేక ఇబ్బందుల్లో ఉన్న సిద్ధార్థ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. తమిళ ప్రేక్షకులను 'గృహం' సినిమా బాగానే ఇంప్రెస్ చెయ్యగలిగింది. మరి తమిళంలో సక్సెస్ సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా  ట్రైలర్ తోనే అందరిని ఆకట్టుకుంది. హారర్ తో కూడిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ నెల 10 న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరి తమిళ్ లో మంచి హారర్ హిట్ ని అందుకున్న సిద్దార్థ్ తెలుగు లో కూడా అదే సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడా.. లేదా... అనేది కూడా చూడాల్సిందే. అయితే తెలుగులో 'గృహం' విడుదల డేట్ కే చాలా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. విజయ్ నటించిన 'అదిరింది' కూడా నవంబర్ 9 న విడుదలవుతుండగా.... మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు', విశాల్ 'డిటెక్టివ్', సందీప్ కిషన్ 'కేరాఫ్ సూర్య' సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. మరి ఇన్ని సినిమాలను తట్టుకుని సిద్దార్ధ్ ఎలా నిలబడతాడో చూడాలి. 

Heavy Competition to Siddharth Gruham Movie:

Siddharth Gruham Movie Release on November 10th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs