Advertisement
Google Ads BL

స్పైడర్‌తో నిరాశ.. మరి ఈ పోలీసోడేం చేస్తాడో?


టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్‌కి స్పైడర్‌తో గట్టి దెబ్బే పడింది. స్పైడర్ చిత్రంతో మురుగదాస్ దర్శకత్వంలో నటించాలనే కోరికతోపాటే... తమిళంలో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ తో బోణి కొట్టాలన్న రకుల్ కోరికలు రెండూ నెరవేరలేదు. స్పైడర్ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోయేసరికి ఒక్కసారిగా డీలా పడిన రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్ చిత్రం విడుదల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఖాకి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. కార్తీ హీరోగా రకుల్ హీరోయిన్ గా ఖాకి సినిమా తెలుగు, తమిళంలో ఈ నెల 17న ఒకేసారి విడుదల కాబోతుంది.

Advertisement
CJ Advs

స్పైడర్ తర్వాత సైలెంట్ అయిన ఈ భామ ఖాకి ప్రమోషన్స్ లో కూడా స్పైడర్ ప్రశ్నలే ఎదురవుతున్నాయి. స్పైడర్ సినిమా ఆశించిన విజయం సాధించలేదు దీనికి మీ సమాధానం ఏమిటని మీడియా ప్రశ్నించగా.. దానికి రకుల్ ప్రీత్ సింగ్ ప్రతిసారి మనం అనుకున్నదే  జరగదు. మన ప్రయత్నం మనం చేస్తాం. కొన్నిసార్లు మనము అనుకున్నాడు రివర్స్ లో జరగొచ్చు.  అలాగే అసలు చివరికి ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం. నా వరకు ప్రతి సినిమాకూ నేను వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. స్పైడర్ సినిమా విషయంలోనూ నేను అదే చేశాను. కానీ ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు అంటూ చెప్పుకొచ్చింది.

స్పైడర్ చిత్రంతో తమిళనాట పాగా వేద్దామనుకున్న రకుల్ ఆ సినిమా ఫలితం నిరాశ పరిచినప్పటికీ... ఇప్పుడు కార్తీ తో నటించిన ఖాకి సినిమాతోనైనా అక్కడ కూడా జెండా గట్టిగా పాతాలని ఆశపడుతోంది. చూద్దాం రకుల్ తెలుగు, తమిళంలో ఖాకి తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.

Rakul Preet Singh Hopes on Khakee Movie:

Rakul Preet Singh Khakee Movie Release on November 17
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs