Advertisement
Google Ads BL

నా వంట తిని ఎవ్వరూ చనిపోలేదు: సమంత!


నాగార్జున ఓ సారి మాట్లాడుతూ, తనకు, నాగచైతన్యకి హెల్త్‌ మీద, ఫిట్నెస్‌ మీద శ్రద్ద ఎక్కువని, అందుకే తాను, నాగచైతన్య ఇతరులు చేసే వంటలు పెద్దగా తినమని, తమ వంటను తామే వండుకుంటామని చెప్పాడు. తన ఫిజిక్‌ ఫిట్నెస్‌ మంత్రం కూడా అదేనని వెల్లడించాడు. సో.. నాగార్జున అమల చేసిన వంటలను కూడా పెద్దగా తినడనే తెలుస్తోంది. ఇక నాగచైతన్య విషయానికి వస్తే. సాధారణంగా మగవారు పెళ్లి తర్వాత భార్యలు రకరకాల రుచులతో చేసే వంటలను కొసరి కొసరి తినిపిస్తూ ఉంటే.. వాటి టేస్ట్‌ బాగాలేకపోయినా భార్యకి కోపం వస్తుందని ఆమె పెట్టిందంతా తిని లావెక్కిపోతారు. ఇప్పుడు అదే ప్రమాదం నాగచైతన్యకి కూడా ఎదురైందని చెప్పుకోవాలి. సాధారణంగా నటీమణులకు నటన, ఇతర విషయాలలోనే బిజీగా ఉంటారు కాబట్టి వారికి వంటా వార్పు తెలియవని అందరూ భావిస్తారు. కానీ తాజాగా మాత్రం సమంత కిచెన్‌లోకి వెళ్లి నాన్‌వెజ్‌, వెజ్‌ రుచులను వండేసింది. అందులో దినుసులు గట్రా ఎక్కువ కాలేదు.. అలాగని తక్కువ కాలేదని చెప్పింది. నా వంట తిని ఎవ్వరూ చనిపోలేదని చిలిపిగా చెప్పింది. 'నోవన్‌ డైడ్‌.. యస్‌...యస్‌' అంటూ తెలిపింది. ఇక కిచెన్‌లోకి వెళ్లి కూరగాయలు కట్‌ చేయడం నుంచి అన్నీ తానే స్వయంగా చేశానని, షూటింగ్‌ క్యాన్సిల్‌ కావడంతో ఈ సారి తాను వంట రుచులు చేసి చూపించానని, ఇకపై కూడా ఖాళీగా, షూటింగ్‌లు లేకపోతే కిచెన్‌లోకి వెళ్లి తానే వంట చేస్తానని చెప్పింది. ఇక సమంత నాగచైతన్యతో వివాహం కాకముందు చైతూ వంటలు వండే ఫొటోలను ఎక్కువగా సోషల్‌మీడియాలో పెట్టి ఏడిపించేది. బహుశా అత్తారింటికి వచ్చిన తర్వాత సమంత వంట చేయడం ఇదే మొదటి సారి కాబోలు. కానీ ఏదీ ఎక్కువ కాలేదు.. ఏదీ తక్కువ కాలేదు అని చెప్పిందే కానీ దానిని తిన్నవారిని అడిగి టేస్ట్‌ ఎలా ఉంది? అనే విషయాన్ని మాత్రం ఈ అల్లరిపిల్ల చెప్పలేదు. అయినా చై సమంత టేస్ట్‌లు చూస్తే ఆయన లావెక్కుతాడని భావించినా, ఫిట్నెస్‌ని మెయిన్‌టెయిన్‌ చేయడంలో సమంత తర్వాతే ఎవరైనా కాబట్టి.. తన భర్త ఫిజిక్‌పై కూడా ఆమె దృష్టి పెట్టే వంటలు, జిమ్‌వర్కౌట్స్‌ వంటివి చేస్తుందని భావించవచ్చు. 

Advertisement
CJ Advs

Samantha surprises with her cooking:

Samantha sometime back confessed that she was a novice in cooking. However she gave a sweet surprise by cooking various dishes yesterday. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs