మన హీరోయిన్ల చేత వార్తలో నిత్యం ఉండటం ఎలా? అనే పాయింట్ మీద పుస్తకాలు రాయిస్తే సెలబ్రిటీలుగా మారాలని, నిత్యం వార్తల్లో ఉండాలనిపించే వారికి గైడెన్స్‌గా ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఓ నటి ఓ ఇంటర్నెట్ బ్లాగ్‌ని పెట్టి ఫిట్నెస్ ఎలా సాధించాలి? వయసు పెరిగినా కొలతలు ఎలా సాధించుకోవాలి? అనే విషయాలను, మహిళల నుంచి వచ్చే ప్రశ్నలకు ఆమె తానే సమాధానం ఇస్తానని, ఫిట్నెస్ కోసం స్పెషల్ వీడియోలు కూడా పెడుతానని చెప్పింది. ఇప్పుడు అలాగే వర్మ, ఇతర మన తెలుగు స్టార్ హీరోయిన్స్ ద్వారా ట్రెండింగ్‌లో ఉండటం ఎలా? అనేది నేర్చుకోవాలి. పిచ్చి పలురకాలు.. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల వంటివి ఏవీ పబ్లిసిటీకి కాదు అనర్హం అని చెప్పాలి.
ఇక విషయానికి వస్తే టాలీవుడ్ చందమామ ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్న 'క్వీన్' రీమేక్ 'పారిస్..పారిస్' షూటింగ్‌లో ఉంది. ఇటీవల ఆమె తన ఫిట్నెస్‌ని చూపిస్తూ, అందాల ఆరబోత చేస్తూ స్టిల్స్‌ని సోషల్‌మీడియాలో పెట్టింది. ఇప్పటికే దశాబ్దంపైగా కెరీర్, 50కి పైగా చిత్రాలలో నటించిన ఆమె అందాలను ఆ ఫొటోలలో చూస్తే ఈ అమ్మడికి మరో నాలుగైదేళ్లు ఢోకా లేదని అనిపించడం ఖాయం. ఇక ఎప్పుడు తనదైన ఫొటోలు, ట్వీట్స్, వెరైటీ కామెంట్స్‌తో ప్రేక్షకులకు, అభిమానులకు, మీడియాకు టచ్‌లో ఉండటంలో కాజల్ పీహెచ్‌డీ చేసిందేమో అనిపించడం ఖాయం...!
తాజాగా ఆమె ఓ భారీ సైజు స్పూన్‌ని నోట్లో పెట్టుకోవాలని చూస్తూ, అలాంటి ఫోజులిచ్చింది. అలాంటి సరదా ఫోటోలను చూపించి ఆమె నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ స్పూన్ సైజ్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఇక ఇందులో నిండుగా షుగర్ ఉందని, ఈ స్పూన్ సైజ్ ఎంతో చెప్పగలరా? అని నెటిజన్లకు ఓ పజిల్‌ని వేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ప్రశ్నకు పలువురు పలు రకాలుగా భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. దానిలో కొన్ని డబుల్ మీనింగ్‌లు కూడా ఉన్నాయి లేండి...! అయినా ఇలాగైనా వార్తల్లో మరలా నిలవడం ద్వారా కాజల్ తాననుకున్నది సాధించింది.