అక్కినేని సమంత పెళ్లి పూర్తి చేసుకుని తన యాక్టింగ్ కెరియర్ లోకి వెళ్ళిపోయింది. ఇలా పెళ్లి చేసుకుని వచ్చిందో లేదో మరుసటి రోజే 'రాజు గారి గది2' ప్రమోషన్స్ కు హాజరైంది. ఆ తర్వాత తమిళ్ లో ఓ మూవీ సంబంధించి ప్యాచ్ వర్క్ ఉంటే ఒక్క రోజులోనే పూర్తి చేసుకుంది. చెన్నై లోనే చైతు వాళ్ళ అమ్మ లక్ష్మి ఇచ్చిన రిసెప్షన్ కూడా పూర్తి చేసుకుంది.
ఇంకా హైదరాబాద్ లో నాగ్ ఇచ్చే రిసెప్షన్ ఒకటే బ్యాలెన్స్ వుంది. నాగ్ ఇచ్చే రిసెప్షన్ పూర్తి కాగానే సమంత, రామ్ చరణ్ తో 'రంగస్థలం' షూటింగ్ లో పాల్గొనబోతోందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఒక న్యూస్ బయటికి వచ్చింది. అదేటంటే సమంత వల్లే 'రంగస్థలం' షూటింగ్ ఆలస్యం అవుతుందని, ముందుగా అనుకున్న విడుదల తేదికి చిత్రం విడుదల కాకపోవచ్చని ఊహాగానాలు ముందు నుంచే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం సమంత రంగస్థలంకు కంటిన్యూగా డేట్స్ ఇచ్చేసిందని టాక్.
ఇక రామ్ చరణ్ ఈ సినిమా పూర్తి చేసుకుని తన తండ్రి ప్రాజెక్ట్ 'సై రా' కోసం వెళ్లిపోవాలని సుకుమార్ కి గట్టిగా చెప్పాడంట. సమంతతో పాటు తను కేటాయించిన కాల్షీట్స్ కు అనుగుణంగా షూటింగ్ పూర్తి చేయాలన్నది వీటి సారాంశం. హైద్రాబాద్ లోనే రంగస్థలం పల్లెటూరి సెట్టింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. చెర్రీ - సమంతలపై కొన్ని వారాల పాటు కీలకమైన సన్నివేశాలను షూటింగ్ చేసేలా.. సుక్కు ప్లాన్ చేసుకుంటున్నాడని టాక్. ఇక ఈ చిత్రాన్ని జనవరి నెలాఖరున విడుదలకు సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. కానీ నిర్మాతల నుండి క్లారిటీ రావాల్సి ఉంది.