బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ - దీపికా పదుకొనెలు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారనే టాక్ వుంది. ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో జంటగా నటించారు కూడా. ప్రవేట్ పార్టీలకు, పబ్లిక్ ఈవెంట్స్ కి వీరిద్దరూ జంటగా హాజరవుతుంటారు. ఇక అప్పుడప్పుడు రణ్వీర్ ఇంటికి దీపికా, దీపికా ఇంటికి రణ్వీర్ వెళుతుంటారనే ప్రచారం బాలీవుడ్ మీడియాలో ఉంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో సరిగా క్లారిటీ లేదుగాని వీరి జంట మాత్రం ఖచ్చితంగా పెళ్లాడుతుందని బాలీవుడ్ జనాలకు గట్టి నమ్మకమే ఉంది. అయితే ఎంతగా ప్రేమలో మునిగి తేలినా ఒక్కోసారి ఈ గాఢమైన ప్రేమలు బ్రేకప్ లకు దారి తీస్తూనే ఉంటాయి. ఇలాంటి బ్రేకప్ లు బాలీవుడ్ కి వెరీ కామన్ కూడా.
ఇప్పుడు తాజాగా రణవీర్ - దీపికా జంట బ్రేకప్ అయ్యిందని వార్తలొస్తున్నాయి. దీపికా మెయిన్ లీడ్ లో సంజీయా లీలా బన్సాలి తెరకెక్కిస్తున్న పద్మావతి చిత్రంలో రణ్వీర్ విలన్ పాత్రలో నటిస్తుండగా, పద్మావతి భర్త పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. అయితే పద్మావతి ప్రమోషన్స్ లో కేవలం దీపికా మాత్రమే పాల్గొని రణ్వీర్ కనబడకపోయేసరికి దీపికాకి, రణ్వీర్ కి బ్రేకప్ అవడం వల్లే వారిద్దరూ కలిసి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదనే టాక్ బాలీవుడ్ మీడియాలో నడుస్తుంది. రణవీర్ వస్తే నేను రాను అని దీపికా చెప్పినట్టు .. రణ్వీర్ రాకపోయేసరికి దీపికా పద్మావతి ప్రమోషన్ లో పాల్గొన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
అయితే దీపికా పదుకొనె - రణ్వీర్ లు బ్రేకప్ చేసుకోలేదని.. వారిద్దరూ ఇంకా పీకల్లోతు ప్రేమలోనే ఉన్నారంటున్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవా లేదని.... వారు సోషల్ మీడియాలో మాట్లాడుకునే మాటలు తెలియచేస్తున్నాయంటున్నారు. పద్మావతి షూటింగ్ లో కూడా వీరిద్దరూ బాగానే వున్నారని.... అందుకే ఇద్దరి మధ్య బ్రేకపోయినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ కొందరు కొట్టిపాడేస్తున్నారు. ఇక ఈ విషయమై అటు దీపికా గాని... ఇటు రణ్వీర్ గాని స్పందించే వరకు ఇలాంటి వార్తలు వినాల్సిందే మరి.