నిడదవోలుకి చెందిన పక్కా తెలుగమ్మాయి నటి గౌతమి. ఆమె తెలుగులో నాటి అందరి అగ్రహీరోలతో చిత్రాలు చేసింది. తెలుగులోనే కాదు... తమిళంలో కూడా రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి వారితో, ఇంకా మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించి నటిగా ఎంతో పేరు సంపాదించింది. నిజంగా తెలుగింటి ఓ నటి ఆ స్థాయికి చేరుకోవడం నిజంగా గర్వపడాల్సిన విషయమే. ఇక ఆమె తెలుగులో మాత్రం చిరంజీవితో నటించలేకపోయింది. తనకు చిరంజీవి చిత్రాలలో అవకాశాలు వచ్చినప్పుడల్లా తాను తమిళంలో రజనీకాంత్ సినిమాలలో బిజీగా ఉండేదాన్ని. దాంతో చిరు గారితో నటించలేకపోయాను. ఇప్పటికీ కొందరితో నటించలేకపోయినందుకు బాధపడుతుంటాను. కానీ అది కూడా సిల్లీగా అనిపిస్తుంది అని చెప్పింది.
ఆరోజుల్లోనే తనకు కారవాన్ ఉండేదని చెప్పిన ఆమె కేవలం తన ఇష్టం.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే నటిని అయ్యానని, నటిగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించే దాకా తనకు ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో కూడా తెలియదని చెప్పింది. కానీ నేడు మీడియా, సోషల్ మీడియా ద్వారా నేటి తరానికి ఫీల్డ్‌లోకి ప్రవేశించక ముందే అన్ని తెలుస్తున్నాయని, తమ రోజుల్లో షూటింగే జీవితంలా అనిపించేదని, కానీ నేటితరం వారు ప్రొఫెషన్‌కి, పర్సనల్ లైఫ్‌కి విదివిడిగా సమయం కేటాయిస్తూ ఉండటం మంచి పరిణామని చెప్పింది. ఇక ఆమె సందీప్ భాటియా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి సుబ్బులక్ష్మి అనే కూతురు ఉంది. తర్వాత కమల్‌తో సహజీవనం చేసింది. ఆయన చేతిలో ఓడిపోయంది. ఇక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా ధైర్యంగా నిలిచి విధిని ఎదిరించింది.