Advertisement
Google Ads BL

చిరు సినిమాలో అరగంట సేపు పవన్!


ప్రస్తుతం మెగాస్టార్‌చిరంజీవి, ఆయన తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌లు కలిసి ఓ చిత్రంలో నటించనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే గతంలో కూడా టి.సుబ్బరామిరెడ్డి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ తీయబోతున్నానని చెప్పాడు. ఆల్‌రెడీ త్రివిక్రమ్‌తో స్టోరీ విషయంలో చర్చలు కూడా నడుస్తున్నాయని సెలవిచ్చాడు. నాడే ఆయన చెప్పిన విషయాన్ని చాలా మంది పబ్లిసిటీ జిమిక్కుగా కొట్టిపారేశారు. చిరంజీవి, పవన్‌లు కూడా ఆ చిత్రం విషయంలో ఏమి స్పందించలేదు. కేవలం టి.సుబ్బిరామిరెడ్డినే హడావుడి చేశాడు. ఇప్పుడు అలాంటిదే మరో వార్త హల్‌చల్‌ చేస్తోంది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం చిరంజీవి తన 151వ చిత్రంగా ప్రతిష్టాత్మకమైన 151వ చిత్రంగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా 'సై...రా... నరసింహారెడ్డి' చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం డిసెంబర్‌ నుంచి సెట్స్‌కి వెళ్లనుండగా, దీనికి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆ తర్వాతి చిత్రం చిరు బోయపాటి శ్రీను తో గీతాఆర్ట్స్‌లో చేస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు 'రంగస్థలం 1985' తర్వాతి చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తుండటంతో చిరు చిత్రం బోయపాటితో ఉండదని తేలిపోయింది. ఇక 'సై...రా' తర్వాత చిరంజీవి నటించే చిత్రం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో అని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ పవన్‌ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌తో చిత్రం చేయనున్నాడు. ఆ తర్వాత ఆయన చిరంజీవితో చేస్తాడని అంటున్నారు. 

ఇక ఈ చిత్రంలో ఓ అరగంట పాటు ఉండే కీలకమైన పాత్రలో పవన్‌కళ్యాణ్‌ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో పవన్‌ చిరంజీవి నటించిన 'శంకర్‌ దాదా జిందాబాద్‌'లో చిన్న అతిథి పాత్రను చేశాడు. మరి త్రివిక్రమ్‌ చిరంజీవితో చేసే చిత్రంలో పవన్‌ ఉంటాడా? లేక ఇది కూడా సుబ్బిరెడ్డి తరహా వార్తా? అనేది అనుమానమే. ఇక గతంలో చిరంజీవి హీరోగా అశ్వనీదత్‌ నిర్మాతగా విజయ్‌భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన 'జై చిరంజీవా' చిత్రానికి రచయితగా త్రివిక్రమ్‌ పనిచేశాడు. ఇక చిరు-త్రివిక్రమ్‌ల చిత్రాన్ని అశ్వనీదత్‌ తన వైజయంతి బేనర్‌లో చేయనున్నాడని సమాచారం. 

Chiranjeevi and Pawan Kalyan Movie Soon :

Pawan Kalyan in Chiranjeevi Next Project
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs