Advertisement
Google Ads BL

'క్వీన్‌' నుండి తప్పుకోవడానికి కారణమిదేనా?


నేడు సోషల్‌ మీడియా విస్తృతం అయిపోయింది. ఏ భాషల్లో ఏ హిట్‌ చిత్రం వచ్చినా దానిని పైరసీలోనో, యూట్యూబ్‌లోనో, లేక అదే ఒరిజినల్‌ భాషల్లో ప్రేక్షకులు చూసేస్తున్నారు. దాంతో నేడు రీమేక్స్‌కి గట్టి దెబ్బ తగులుతోంది. ఇక కేవలం సినిమాలోని మెయిన్‌ పాయింట్‌ని మాత్రమే తీసుకుని, సినిమా మొత్తం మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. ఒరిజినల్‌ భాషలో హిట్టయిన వెంటనే ఈ రీమేక్‌ని చేయాలి. లేకపోతే ఇబ్బందికర పరిస్థితే ఎదురవుతోంది. 

Advertisement
CJ Advs

ఇక బాలీవుడ్‌లో కంగనారౌనత్‌ ప్రధాన పాత్రలో 'క్వీన్‌' వచ్చి ఎంతో కాలం అయింది. కానీ ఈ చిత్రం దక్షిణాదిలో రీమేక్‌ హక్కులు తీసుకున్నారే గానీ ఇప్పటికే ఆలస్యమైంది. ఇక ఈ చిత్రం బాలీవుడ్‌లో 14కోట్లతో రూపొంది 100కోట్లు వసూలు చేయడంతో అదే మ్యాజిక్‌ని ఈ చిత్రం దక్షిణాదిలో కూడా చేస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాదు. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో తమన్నా, తమిళంలో కాజల్‌, మలయాళంలో మంజిమామోహన్‌, కన్నడలో పరుల్‌యాదవ్‌లు.. కంగనారౌనత్‌ పాత్రను చేస్తున్నారు. ఇక 'క్వీన్‌' చిత్రంలో కంగనా ఫ్రెండ్‌ పాత్రలో లిసా హెడన్‌ నటించింది. 

కాగా ఈ పాత్ర కోసం అమీజాక్సన్‌ని తీసుకున్నారు. కానీ ఆమె సడన్‌గా ఈ చిత్రం నుంచి తప్పుకుంది. దాంతో ఆ పాత్రకు ఐపిఎల్‌ హాట్‌ యాంకర్‌ శిబాని దండేకర్‌ని తీసుకున్నారు. తనకు హాలీవుడ్‌లో 'సూపర్‌గర్ల్‌' అనే సిరీస్‌ రావడంతో తప్పుకున్నానని అమీజాక్సన్‌ చెప్పుకొచ్చింది. కానీ అది నిజం కాదని, ఇప్పటికే శంకర్‌తో 'ఐ' చేసిన ఈ భామ ప్రస్తుతం '2.0'లో నటిస్తున్నందు వల్ల తన క్రేజ్‌ మరింత పెరిగిందని, ఈ సమయంలో ఇలాంటి సపోర్టింగ్‌రోల్‌ చేయడం ఇష్టం లేకపోవడంతోనే అమీ తప్పుకున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రం అన్నిభాషల షూటింగ్‌ను పారిస్‌లో ఒకే చోట చిత్రీకరిస్తూ.... ఆ నలుగురు క్వీన్లకు ఓకే హోటల్‌లో బస ఏర్పాటు చేయడం విశేషం. 

Amy Jackson Out From Queen Remake:

Amy Jackson shock to&nbsp;<span>Queen Remake Team</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs