Advertisement
Google Ads BL

ప్రగతి అమ్మపాత్రల వెనుకవున్న కహానీ ఇదే!


తెలుగు సినిమాలలో అమ్మగా, వదినగా, అత్తగా కనిపించే నటి ప్రగతి. కాగా ఈమె 24-25ఏళ్ల వయసులోనే తల్లి పాత్రలు చేసింది. ఇక ఈమె ఇలాంటి పాత్రలే చేయడానికి గల కారణం గురించి చెబుతూ,నేను 'అక్కాచెల్లెళ్లు' సీరియల్‌లో నటిస్తున్నప్పుడు సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుంచి కాల్‌ వచ్చింది. ఈ చిత్రంలో తల్లి పాత్ర చేయాలని ఫోన్‌ చేశారు. ఇంత చిన్న వయసులో ఉన్న నన్ను తల్లి పాత్రకి అడుగుతారా? అని కోపం వచ్చి మరలా ఫోన్‌ చేస్తానని ఫోన్‌ పెట్టేశాను. అప్పుడు అక్కడ ఆ సీరియల్‌లో నటిస్తున్న శ్రీవిద్యగారు ఉన్నారు. ఫోన్‌ వచ్చిన విషయం ఆమెకి చెప్పాను. ఆమె నాతో 'క్యారెక్టర్‌ నటిగా ఉండాలనుకుంటున్నావా? లేక హీరోయిన్‌గానే చేయాలని ఆగుతావా' అని ఆమె ప్రశ్నించారు. నేనేమోనసిగాను. 

Advertisement
CJ Advs

దానికి శ్రీవిద్యగారు సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ చాలా పెద్ద సంస్థ. ఆ చిత్రంలో ఆర్తిఅగర్వాల్‌ తల్లిగా నటించినా కూడా నీకు మంచి పేరు వస్తుంది. చేస్తానని ఫోన్‌ చేసి చెప్పు అని నాకు సలహా ఇచ్చారు. నేడు నేనిలా ఉండటానికి ఆమె కారణం. ఇక 'ఢమరుకం' చిత్రంలో నేను అనుష్క తల్లిగా నటించాను. దానికి అనుష్క బాధపడి దర్శకునితో ఇంత చిన్న అమ్మాయి నాకు తల్లిగా నటించడం ఏమిటి? ఆమె ఎంత అందంగా ఉందో చూడండి అని అంది. కానీ నేను చేస్తాను. ఫర్వాలేదని చెప్పాను. ఇంకో చిత్రం హీరోయిన్‌ పాత్రకి పిలిచారు. షూటింగ్‌లో హీరో ఎవరండీ అని అడిగితే ఆ దర్శకుడు నేనే హీరో అనడంలో పక్కకి వెళ్లి ఏడ్చాను.. అని చెప్పింది. 

Character Artist Pragathi About Mothers Roles:

Character Artist Pragathi Latest Interview Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs