Advertisement
Google Ads BL

క్లీన్‌షేవ్‌లోనూ, గడ్డంతోనూ మెప్పిస్తున్నాడు!


దగ్గుబాటి రానాకు ఆయన ట్రేడ్‌ మార్క్‌ అంటే ఆయన గడ్డమేనని చెప్పాలి. ఆయన గడ్డం లేకుండా క్లీన్‌షేవ్‌లో కనిపించడం అరుదు. కానీ ఆయన సమంత-నాగచైతన్యలకు చెన్నైలో చైతు తల్లి లక్ష్మి ఇచ్చిన రిసెప్షన్‌లో రానా దగ్గుబాటి క్లీన్‌షేవ్‌తో కనిపించాడు. దాంతో ఆ పార్టీలో ఆయన్ను వెంటనే ఎవ్వరు గుర్తుపట్టలేదు. కొందరైతే ఆయననే ఎవరు మీరు అని అడిగేశారట. దాంతో ఆయన మీ రానానే నండి అని చెప్పాల్సివచ్చింది. ఇక ఆయన క్లీన్‌షేవ్‌లో కనిపించడానికి '1945' చిత్రంలోని పాత్రే కారణం. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం 1945 కాలంలో జరిగే సంఘటనలతో రూపొందుతోంది. ఈ చిత్రంలో ఆయన సుభాష్‌చంద్రబోస్‌ సైన్యంలో అధికారిగా కనిపించనున్నాడు. కాగా రానా నీట్‌ షేవ్‌ చేయకముంందు ఆయనపై కొన్నిసీన్లు తీశారు. తర్వాత క్లీన్‌షేవ్‌లో మరిన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా రానా క్లీన్‌షేవ్‌తో కనిపించే సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. మరికొన్ని సీన్స్‌ని ఆయనపై గడ్డంతోనే తీయాల్సివుంది. దాంతో మరోసారి రానా దగ్గుబాటి తనకిష్టమైన ట్రేడ్‌ మార్క్‌ గడ్డాని మరలా పెంచుతున్నాడు. సత్యశివ దర్శకత్వంలో రెజీనా హీరోయిన్‌గా సత్యరాజ్‌, నాజర్‌ వంటి 'బాహుబలి' నటులు ఇందులో నటిస్తుండగా, సత్యశివ అనే దర్శకుడు డైరెక్షన్‌ చేస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళంలో 'మరుందైతీరం' అనే టైటిల్‌ పెట్టారు. 

మొత్తానికి గడ్డంలోనే కాదు.. క్లీన్‌షేవ్‌లో కూడా ఈ హీమ్యాన్‌ అమ్మాయిల మనసు దోచుకుంటూ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అనిపించుకుంటున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత రానా గుణశేఖర్‌ దర్శకత్వంలో 'హిరణ్యకస్య' చిత్రంలో నటించనున్నాడట. గుణశేఖర్‌ నటించిన 'రుద్రమదేవి'లో కూడా రానా నటించాడు. ఈ చిత్రం భక్తప్రహ్లాద కథే అయినా హిరణ్యకస్యపుని కోణంలో సాగుతుంది. అయితే ఈ చిత్రానికి 100కోట్లు బడ్జెట్‌ని అంచనా వేస్తున్నారు. మరి సోలోగా రానాకి అంత మార్కెట్‌లేదు. ఇప్పుడు గుణశేఖర్‌కి రానా ఓకే అన్నా 100కోట్ల బడ్జెట్టే తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. 

Rana Clean Shave Pic Sensation in Social Media:

Rana Clean Shave in 1945 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs