ఏపీలో రాజకీయాలలాగానే తెలంగాణలో కూడా ఇప్పుడే రాజకీయ వేడిని రేకెత్తిస్తున్నాయి. వచ్చేసార్వత్రిక ఎన్నికలు ముందే వచ్చే అవకాశంఉండటం, జమిలీ ఎన్నికల విషయంలో కూడా చర్చలు జరగనుండటం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ఇక ఏపీలో జగన్ పాదయాత్రలా తెలంగాణలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం టిఆర్‌ఎస్ నాయకులకు మింగుడు పడటం లేదు. రేవంత్‌రెడ్డి కీలక రాజకీయ నాయకుడే కాదు.. మంచి వాగ్దాటి, విమర్శలు సంధించేతీరు, ప్రత్యర్ధులను ఆయన టార్గెట్ చేసే విధానం అద్భుతంగా ఉంటాయి.
మరోవైపు ఆయన టిడిపికి, పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి తన చిత్తశుద్దిని నిరూపించుకున్నాడు. కానీ తెలంగాణలో టిడిపి నుంచి వలసలను పోషిస్తోన్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ కూడా ఏపీలో టిడిపిలాగానే తమ పదవులకు పార్టీకి రాజీనామా చేయకుండా తమ పార్టీలలోకి జంప్ చేసినవారికి ఎలా మంత్రి పదవులిచ్చిందో టీఆర్‌ఎస్ కూడా అదే పని చేస్తోంది. ఇక టిడిపి నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి మంత్రి పదవి ఇచ్చింది. ఈ వ్యవహారం కాస్త టీఆర్‌ఎస్‌కి ఇబ్బందికర పరిణామమేనని చెప్పవచ్చు.
ఇక రేవంత్‌రెడ్డిని 'బాహుబలి' గా చూపించిన వర్మ తాజాగా రేవంత్‌రెడ్డిని బాస్ ఈజ్ బ్యాక్ అని, నిజమైన బాస్ కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి అని అంటూ ఆయన్ను 'ఖైదీనెంబర్ 150' చిత్రంలోని మెగాస్టార్ ఫోటోలను మార్ఫింగ్ చేసి రేవంత్‌ని చిరు స్థానంలో పెట్టాడు. ఇక రేవంతే కాదు...రాహుల్‌గాంధీ, సోనియాలే కాదు వారి జేజెమ్మలు వచ్చినా వచ్చే ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌దే గెలుపు అని, దానిని ఎవ్వరూ ఆపలేరని, కాంగ్రెస్ బాస్‌లు ఢిల్లీలో ఉన్నా, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి ప్రజలే బాస్‌లని, కేసీఆర్‌ని మరోసారి ముఖ్యమంత్రి కాకుండా ఎవ్వరూ ఆపలేరని, ఆ విషయం రాహుల్, సోనియాలకు కూడా తెలుసని అన్నాడు. అయినా రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇంత ఓవర్‌కాన్ఫిడెన్స్ కేటీఆర్‌కి అవసరమా?