Advertisement
Google Ads BL

రిసెప్షన్‌ కి నాగ్ డేట్ ఫిక్స్ చేశాడు..!


ఎవరైనా పెళ్లి అయిన వెంటనే రిసెప్షన్‌ ఇస్తారు. కానీ నాగచైతన్య-సమంతల విషయంలో ఇలా జరగలేదు. అక్టోబర్‌ 6,7 తేదీల్లో వీరి వివాహం గోవాలో హిందు, క్రిస్టియన్‌ మత సంప్రదాయాలలో జరిగింది. ఈ పెళ్లి అయిన వెంటనే సమంత తన 'రాజు గారి గది2' ప్రమోషన్స్‌లో తన మామయ్య నాగార్జునతో కలిసి బిజీ అయిపోయింది. మరోవైపు 'మహానటి' షూటింగ్‌లో పాల్గొని దాదాపు తన పార్ట్‌ షూటింగ్‌ను పూర్తి చేసింది. ఇక నాగచైతన్య తల్లి, సమంత అత్త లక్ష్మీ ఈ దంపతులకు దగ్గుబాటి బంధువులను పిలిచి చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఇచ్చింది. ఇది పూర్తి కాగానే సమంత, నాగచైతన్యలు లండన్‌కి హనీమూన్‌కి వెళ్లి వచ్చారు. 

Advertisement
CJ Advs

ఇక పెళ్లయిన తర్వాత సమంత కనీసం మీడియాకు కనిపించింది గానీ నాగచైతన్య మాత్రం ఎవ్వరి ముందుకు రాలేదు. ఇక వీరి పెళ్లికి కేవలం ముఖ్యమైన అతిధులనే పిలవడంతో హైదరాబాద్‌లో నాగార్జున భారీ రిసెప్షన్‌ని ఇస్తాడని అందరూ భావించారు. కానీ నాగ్‌ మాత్రం తీరిగ్గా నెల తర్వాత రిసెప్షన్‌ ఇచ్చినా ఫర్లేదులే అని మీడియాతో అన్నాడు. ఎట్టకేలకు ఈ నెల 12 వ తేదీన నాగచైతన్య-సమంతల రిసెప్షన్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నాగ్‌ భావిస్తున్నాడు. 

సినీ ఇండస్ట్రీలోనే కాదు.. పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, రాజకీయనాయకులతో కూడా నాగ్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన ఈ రిసెప్షన్‌కి తనకు తెలిసిన అందరినీ పిలుస్తాడని అంటున్నారు. ఇక ఆరోజు వీలుకాకపోతే ఈ నెలలోనే మరో డేట్‌ని చూసి ఆయన రిసెప్షన్‌ ఇస్తాడట. ఇక నాగచైతన్య ప్రస్తుతం చందుమొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి', మారుతి చిత్రాలలో నటించనున్నాడు. ఈ రెండు పూర్తయిన తర్వాత ఆయన వెంకటేష్‌తో కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో మామా అల్లుళ్లుగా ఓ మల్టీస్టారర్‌ చేయనున్నాడు. ఇక సమంత 'రంగస్థలం 1985' చిత్రం షూటింగ్‌లో పాల్గొననుంది. మరి ఈ రిసెప్షన్‌కి అభిమానులను కూడా పిలుస్తారో లేదో వేచిచూడాల్సివుంది...! 

Naga Chaitanya and Samantha's Reception Date Locked!:

Naga Chaitanya and Samantha's Reception on November 12?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs