జి.ఎస్.టి. పై వేసిన పంచులతో విజయ్ నటించిన 'మెర్సల్' చిత్రం ఎన్ని వివాదాలకు కారణమైందో ప్రత్యక్షంగా చూస్తూనే వున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పంటూ డైరెక్ట్ గా చెంప చెల్లుమనేలా కొట్టిన 'మెర్సల్' పై బిజెపి నేతలు పగబట్టి.. 'మెర్సల్' కి ఎన్నో ఇబ్బందులని కలిగించారు. కానీ ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరధం పట్టడంతో బిజెపి పప్పులుడకలేదు. అయితే తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇంతవరకు విడుదల కాలేదు. 'అదిరింది' పేరుతో రావాల్సిన ఈ చిత్రం గురించి టాలీవుడ్ లో ఇప్పుడొక వార్త హల్చల్ చేస్తుంది.
ఈ సినిమా టాలీవుడ్ లో అగ్ర నిర్మాత శరత్ మరార్ విడుదల చేయాల్సివుంది. కానీ ఈ సినిమా ఈ రోజుకి విడుదల కాలేదు. నిన్న మొన్నటి వరకు తెలుగులో సెన్సార్ ప్రాబ్లెమ్ ఉందని అందుకే విడుదల కావట్లేదు అని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇంకో వార్త కూడా వినపడుతుంది. అదేటంటే 'మెర్సల్' సినిమా యొక్క రైట్స్ టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తీసుకున్నారని, అయన ఈ చిత్రాన్ని అనువాదం చేయకుండా, టాలీవుడ్ టాప్ హీరోతో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తాజాగా న్యూస్ వినిపిస్తుంది. తెలుగు వెర్షన్ లో ఎవరు నటిస్తారు అనేది సస్పెన్స్ గా వున్నా... ఫిలింనగర్ గుసగుసల ప్రకారం పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాని తెరకెక్కించాలని అరవింద్ ప్లాన్ చేస్తున్నాడని టాక్స్ వచ్చేశాయి. ఇదే నిజం అయితే మాత్రం పవన్ కి పొలిటికల్ గా కూడా పదును పెరగడం ఖాయం.