శ్రియ అలాంటి వారి కోరిక తీరుస్తుంది..!


ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లయినా కూడా శ్రియ ఫిట్నెస్‌ అమోఘం. అనాటి కొలతలనే ఇప్పటికీ ఆమె మెయిన్‌టెయిన్‌ చేయడమే కాదు... అవే అందాలను కొత్తరూపు సంతరించుకునేలా చేస్తోంది. ఇటీవలే ఆమె దిగిన బికినీ స్టిల్స్‌ ఓ ఊపు ఊపాయి. ఈ భామ బ్యూటీ సీక్రెట్‌ ఏమిటి? అని అందరూ, మరీ ముఖ్యంగా లేడీస్‌, హీరోయిన్లు కూడా చర్చించుకునేలా ఆ ఫొటో షూట్‌లో ఆమె కనిపించింది. ఇక నీళ్లలోకి ఈత కొట్టడమంటేనే ఎందరికో భయం. కానీ ఈమె ఏకంగా అండర్‌ వాటర్‌లో ఫొటో షూట్‌ చేసింది. ఇందులో ఆమె హాట్‌ హాట్‌గా, నీట్‌ నీట్‌గా కనిపించే ఫొటోలు కూడా ఉన్నాయి. 

ఈమె అండర్‌ వాటర్‌లో చేసిన ఫొటో షూట్‌ ఫోటోలను చూస్తే ఆమె అందానికే కాదు.. ఆమె ధైర్యానికి కూడా మనం ఫిదా అయిపోతాం. అనూవ్‌ అనే డీప్‌ వాటర్‌ ఫోటోగ్రాఫర్‌ ఈ ఫోటోలను తీశాడు. వాటిని శ్రియ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలు ఇప్పటికే వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన వారే మరలా మరలా చూస్తూ ఈ ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ఇక ఈమె ఈమద్య కాస్త సీనియర్‌ హీరోల సరసన నటిస్తుండటంతో ఎక్స్‌పోజింగ్‌, బికినీ వంటి వేషాలు వేసే పాత్రలు తగ్గాయి. దాంతో ఈమె ఇలాంటి ఫోటో షూట్ల ద్వారా తనను ఇలా చూడాలనుకునే వారి కోరికను తీరుస్తోందని చెప్పవచ్చు. సామాన్యంగా వయసు శరీరానికే గానీ మనసుకి కాదు అంటారు. ఇక శ్రియ విషయానికి వస్తే ఆమె శరీరానికి, మనసుకి కూడా ఇంకా టీనేజ్‌నిండలేదేమో అనిపించడం ఖాయమని ఒప్పుకుంటారు. 

Shriya gives a Bikini Blast:

Shriya Under Water Pic Sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES