కట్టుకున్న భార్యని కూడా ఆమెకి ఇష్టం లేకుండా, బలవంతంగా భర్త సెక్స్ చేస్తే దానిని కూడా రేప్‌గానే భావించాలని కోర్టులు తీర్పులు చెబుతున్నాయి. ఇక హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హీరోయిన్లకు లైంగిక వేధింపులు అనేవి సాధారణం అయిపోయాయి. ముఖ్యంగా మలయాళ నటి లైంగిక వేధింపులు, కిడ్నాప్ వ్యవహారం, సుచీలీక్స్ తర్వాత అందరు హీరోయిన్లు దీనిపై స్పందిస్తున్నారు. హాలీవుడ్ నిర్మాత వ్యవహారం తర్వాత ఈ స్పందన మరింతగా పెరిగింది. అందరూ 'మీ టూ' అని అంటున్నారు. కంగనా రౌనత్ నుంచి వరలక్ష్మిశరత్‌కుమార్ వరకు అందరూ ఇదే చెబుతున్నారు.
ఇక అక్షయ్‌కుమార్ అయితే లైంగిక వేధింపులు అనేవి కేవలం మహిళలకే.. అందునా సినిమా ఫీల్డ్‌లోనే కాదు... తాను చిన్నప్పుడు పెరిగిన అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్ బోయ్ నుంచి పలువురి ద్వారా నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పాడు. ఇక రాశిఖన్నా కూడా 'మీ టూ' అని, లైంగిక వేధింపులు అనేవి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక వయసులో ప్రతి ఒక్కరికి అనుభవం అవుతూనే ఉంటాయని, పురుషులు కూడా ఇలా వేధింపులకు గురవుతున్నారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయంలో తాజాగా తమన్నా స్పందించింది.
సినిమా ఇండస్ట్రీలో ఇది ఉంది. అది కూడా నాకు వేరే వారు చెబితేనే తెలిసింది. ఏదైనా మనం ఎంచుకునే పద్దతి, దారిలోనే ఉంటుంది. నేను 'శ్రీ' చిత్రం నుంచి ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు ఎదుర్కొలేదు. టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా నాకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని చెబుతోంది. తమకు అనుభవాలు ఎదురుకాలేదని చెప్పిన వారు ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్తారు. లేదా సర్దుకుపోతారు? మరి తమన్నా ఏ కేటగిరికి చెందుతుందో అని ఆమె మాటలపై సెటైర్లు వినిపిస్తున్నాయి.