Advertisement
Google Ads BL

అందరూ ఏంజెల్ అంటారు: హెబ్బా పటేల్!


మరోసారి టైటిల్ రోల్ లో నటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది: హెబ్బా పటేల్ 

Advertisement
CJ Advs

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'ఏంజెల్'. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఈ చిత్రం నవంబర్ 3న విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్ హెబ్బా పటేల్ విలేకరులతో ముచ్చటిస్తూ... ఏంజిల్ సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఈ చిత్రం నవంబర్ 3న విడుదలవుతోంది. గ్రీన్ మ్యాట్ లో చేసిన  షూట్ ను నేను బాగా ఎంజాయ్ చేసి నటించాను. 45 నిమిషాలకు పైగా సీజీ సీన్స్ ఉండడంతో దాదాపు నాలుగు నెలలు కష్టపడి పని చేశారు సినిమా యూనిట్. కుమారి 21ఎఫ్ సినిమా తరువాత మరోసారి ఏంజిల్ టైటిల్ రోల్ లో నటిస్తున్నందుకు హ్యాపీగా ఉన్నాను, ఈ చిత్రంలో నా పాత్ర ఏంజెల్.. అందరూ అలానే పిలుస్తుంటారు. 

దివి నుంచి దిగివచ్చిన నాకు, హీరోకు, సప్తగిరికు మధ్య పరిచయం ఎలా అవుతుంది? దివి నుంచి దిగికి ఎలా వచ్చాను ఆ తరువాత ఏం జరిగిందనేదే చిత్ర కథాంశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇంతకు ముందు నా సినిమాల కంటే.. ఈ చిత్రంపై చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నానో.. అంతే నెర్వస్ గా కూడా ఫీల్ అవుతున్నాను. ఈ కథ ఎంచుకోవడానికి మాత్రం సినిమా కంటెంటే ముఖ్య కారణం. స్టోరీ లైన్ బాగా నచ్చింది. డైరెక్టర్ పళని గారు అద్భుతంగా కథను నారేట్ చేయడమే కాకుండా గ్రాఫిక్స్ ను కూడా అంతే అద్భుతంగా ప్రెసెంట్ చేశారు.  డిఫరెంట్ జోనర్ లో నటించడం మొదటిసారి కనుకే ఏంజెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.   

నా పాత్రలో చాలా వేరియేషన్స్ కనపడుతాయి. చెప్పాలంటే ఈ  సినిమాను చాలా భాద్యతగా ఫీల్ అయ్యి నా భుజస్కంధాలపై  వేసుకొని నటించానని చెప్పొచ్చు. హీరో అన్వేష్ కొత్త అయినా చాలా హార్డ్ వర్కర్. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్  చాలా బాగా చేశారు. మంచి హీరో అవడానికి ఆస్కారమున్న వ్యక్తి. ఈ ఏంజెల్ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలని తపించాడు. తప్పకుండా బిగ్ హీరో అవుతారు అన్వేష్.  ఇక నా విషయానికి వస్తే ఒకటిన్నర సంవత్సరం నుంచి వరుస సినిమాలతో షూటింగ్స్ తో బిజీ గా గడిపాను అందుచే కొంత కాలం గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ముంబయ్ లో ఇల్లు కొన్నాం అక్కడే వాటి పనులు చూస్తూ అక్కడే కొంత రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సినిమా బిజీలో పడి నాకు నేను నా గురుంచి పట్టించుకోవడం మానేశా అందుకే రెస్ట్ కావాలి అనుకుంటున్నాను. చిన్న గ్యాప్ కోసమే ప్రస్తుతానికి ఏ సినిమాలను అంగీకరించడం లేదు అని అన్నారు హెబ్బా... 

Hebah Patel Interview About Angel Movie:

Hebah Patel Talks About Angel Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs