మరో పోర్న్‌స్టార్‌ ఆగమనం..!


పోర్స్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగి, తర్వాత బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సన్నిలియోన్‌ నేడు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. పోర్న్‌స్టార్స్‌ ఏమీ అంటరాని వారు కాదని ఆమె నిరూపించింది. తనదైన అందాల ప్రదర్శన, ఐటంసాంగ్స్‌తో పాటు నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో కూడా ఆమె నటిస్తోంది. నేడు మనదేశంలో ఎక్కువ ఫాలోయింగ్‌ ఉన్న సెలబ్రిటీగా ఈమె విపరీతమైన క్రేజ్‌ను సాధించింది. ఇక పోర్న్‌ వీడియోలు చూసే వారికి మియా ఖలీఫా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బురఖా వేసుకుని సెక్స్‌ చేసిన వీడియో నాడు సంచలనంగా మారింది. ముస్లింవి అయి ఇలా నటిస్తావా? అని ముస్లిం మత పెద్దల నుంచి ఐసిస్‌ ఉగ్రవాదుల నుంచి కూడా చంపేస్తామని ఆమె బెదిరింపులను ఎదుర్కొంది. 

ఇక ఈమె క్రేజ్‌కి ఉదాహరణ చెప్పాలంటే మోస్ట్‌ గూగుల్‌ సెర్చ్‌ ఘనత సాధించిన వారిలో ఈమె కూడా ఒకరు. ఆమద్య ఈమె క్రిస్టియన్‌ మతం పుచ్చుకుని, జీసస్‌ ఫొటో, శిలువ ఉన్న గదిలో, మెడలో క్రాస్‌గుర్తు గొలుసువేసుకుని మరీ పోర్న్‌వీడియోలలో కనిపించి, క్రిస్టియన్ల ఆగ్రహానికి లోనైంది. ఇక హిందూ దేవుళ్లయిన వినాయకుడు ఉన్న చోట కూడా ఇలాగే చేసింది. తాజాగా తనను తాను మేరిమాతగా కనిపించే ఫోటోని సోషల్‌ మీడియాలో పెట్టి పెద్ద చర్చకు కారణమైంది. 

ఇక ఈమె త్వరలోనే మలయాళ ఇండస్ట్రీ ద్వారా ఇండియాలో వెండితెరకు పరిచయం అవుతోంది. ఆమె గతంలో వచ్చిన అడల్ట్‌ మూవీ అయిన మలయాళ చిత్రం 'చంక్జ్‌' సినిమాకి సీక్వెల్‌గా రూపొందనున్న 'చంక్జ్‌2'లో ఆమె ప్రధాన పాత్రను చేయడమే కాదు.. ఓ ఐటం సాంగ్‌లో కూడా నటించనుంది. ఈ విషయాన్ని దర్శకుడు ఒమర్‌లులూ ప్రకటించాడు. కాగా ప్రస్తుతం ఆమె బాగా ఇష్టపడే స్పోర్ట్స్‌కి హోస్ట్‌గా 'కాంప్లెక్స్ న్యూస్‌' అనే యూట్యూబ్‌ చానెల్‌కి పనిచేస్తోంది. ఇక ఈమె నటించే మలయాళ చిత్రం 2018లో మొదలై, రిలీజ్‌ అవుతుంది. సో.. సన్నిలియోన్‌కి పోటీగా ఇప్పుడు మియా ఖలీఫా కూడా రెడీ అయిందని చెప్పవచ్చు. మరి వీరిమధ్య పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారో వేచిచూడాల్సివుంది! 

Porn Star Mia Khalifa is making Her South Debut with Chunkzz 2:

Porn star Mia Khalifa is said to be playing an important role in the upcoming Malayalam film Chunkzz 2 The Conclusion.
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES