గత ఏడాది 'బ్రహ్మోత్సవం' సినిమా వంటి డిజాస్టర్స్ తో చేతిలో సినిమాలు లేక ఖాళీగా కూర్చున్న కాజల్ అగర్వాల్ కి 'ఖైదీ నెంబర్ 150' హిట్ తో మళ్ళీ దశ తిరిగింది. ఆ తర్వాత చిన్న బడ్జెట్ సినిమా అయిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో రానా సరసన తక్కువ పారితోషికానికే పనిచేసింది. ఆ సినిమా హిట్ అవడం.. తమిళంలో అజిత్ తో నటించిన 'వివేగం' కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ అవ్వడం, విజయ్ సరసన నటించిన 'మెర్సల్' కమర్షియల్ హిట్ సాధించడంతో కాజల్ అగర్వాల్ మళ్ళీ ఫామ్ లో కొచ్చేసింది. దెబ్బకి దశ తిరిగిన కాజల్ కి ఇప్పుడు కొంచెం ఎక్కువైంది అంటున్నారు.
వరుస హిట్స్ తో మళ్ళీ ఫామ్ లో కొచ్చిన కాజల్ అగర్వాల్ పారితోషికం విషయంలో చెట్టెక్కి కూర్చుంది. గతంలో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు డిమాండ్ కి తగ్గ పారితోషికం వసూలు చేసిన కాజల్ గత ఏడాది ప్లాప్స్ తో తన పారితోషికాన్ని తగ్గించుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ వరుస హిట్స్ తో దూసుకుపోతూ తన పారితోషికం విషయంలో రాజీపడనంటుంది. ఇప్పుడు కాజల్ చేతిలో కళ్యాణ్ రామ్ సినిమా ఎమ్యెల్యే ఉండగా.. తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించబోయే సినిమాలో హీరోయిన్ పాత్ర ఆఫర్ చేయగా.. కథ నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పిందట కాజల్. కానీ ఈ సినిమాకు నిర్మాతలు 70 లక్షల పారితోషికం అని చెప్పగానే ఆమె ఈ సినిమాలో చెయ్యడానికి నో అనేసిందట.
కోటికి తక్కువైతే తన దగ్గరకి రావద్దని.... అసలు కోటికి తక్కువ ఉంటే ఎటువంటి సినిమా చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పిందట. దీంతో భయపడ్డ నిర్మాతలు కాజల్ కు బై బై చెప్పేసి వేరే హీరోయిన్ల మీద ఫోకస్ పెట్టారట. మరి కాస్త ఫామ్ లోకి రాగానే ఇలా చెట్టెక్కి ఆకాశాన్ని చూసే హీరోయిన్స్ ని ఏమనాలి.