Advertisement
Google Ads BL

బాహుబలి.. వీపు సుందరులు.. ఏంటో మాకీ కర్మ?


మన పెద్దలు తెలివి ఎక్కువగా ఉన్న వారిని ఉద్దేశించి.. నీకు అతి తెలివి అంటారు. నిజంగానే అతితెలివి వల్ల కూడా జీవితాలను, కెరీర్లను నాశనం చేసుకున్న వారు ఉన్నారు. ఉదాహరణకు క్రికెటర్‌ రోహిత్‌ శర్మని తీసుకుంటే ఆయన గురించి సచిన్‌, కపిల్‌దేవ్‌, గవాస్కర్‌ వంటి వారు చెప్పినది ఏమంటే.. ఓ బాల్‌ని రోహిత్‌శర్మ అనేక విధాలుగా ఆడగలడు. అలా సామర్ద్యం ఎక్కువ కాబట్టే ఆయన ఓ బాల్‌ని ఏ రకంగా కొట్టాలో తేల్చుకోలేక అవుట్‌ అవుతాడని చెప్పారు. ఇదే మాటలు రాంగోపాల్‌వర్మకి కూడా వర్తిస్తాయి. 

Advertisement
CJ Advs

ఆయన అతి మేధావి. సినిమాలే కాదు...రాజకీయాలు, వివిధ వ్యక్తుల జీవిత చరిత్రలు, వారి ఫిలాసఫీలు, టెర్రరిజం నుంచి కందిపప్పు రేటు పెరగడం వరకు ఆయన దేనిపైనైనా మాట్లాడగలడు. అలాగే ట్రంప్‌ నుంచి కేసీఆర్‌ వరకు ఎవరినైనా తిట్టగలడు. పొగడగలడు. అసలు అర్ధంకాని కామెంట్స్‌తో పిచ్చెక్కించగలడు. తన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం విషయంలో తనపై విమర్శలు హెచ్చరికలు చేసిన వారికి ఆయన ఇచ్చిన కౌంటర్లకు చంద్రబాబు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వరకు ఎవ్వరూ ప్రతి స్పందించలేకపోయారు. ఇక ఆయన ప్రస్తుతం టిడిపి మీద గుర్రుగా ఉన్నాడు. దాంతో టిడిపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డిపై ఆయనకు ఎంతో ప్రేమ కలిగింది. ఈ విషయాన్ని ఆయన చేసిన కామెంట్స్‌ చూస్తే అర్ధమవుతుంది. 

రేవంత్‌రెడ్డి ఓ బాహుబలి వంటి వాడని, కాంగ్రెస్‌ సినిమా థియేటర్‌ అయితే రేవంత్‌రెడ్డి బాహుబలి అని, సినిమా థియేటర్లకు బాహుబలి కలెక్షన్ల వర్షం ఎలా కురిసిందో, రేవంత్‌రెడ్డి వల్ల కాంగ్రెస్‌కి ఓట్ల వర్షం కురుస్తుందని వ్యాఖ్యానించాడు. రేవంత్‌రెడ్డి పార్టీ మారడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మరలా కాంగ్రెస్‌పై నాకు నమ్మకం కలిగించిందని చెబుతూ, బాహుబలి గెటప్‌లో రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టి సోషల్‌మీడియాలో పెట్టాడు. చివరగా 'సాహో.. బాహుబలి రేవంత్‌రెడ్డి' అని క్యాప్షన్‌ పెట్టాడు. అదే సమయంలో ఆయన మరో వ్యక్తిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టాడు. 

'లక్ష్మీస్‌ వీరగ్రంథం' తీస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి, ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కన్నా 100రెట్టు ఎక్కువ ఎక్స్‌ట్రార్డినరీ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఉంది. ఆయన్ను చూసి మహేష్‌బాబు కూడా కుళ్లుకుని చనిపోతాడు. 'లక్ష్మీస్‌ వీరగంధం'లో వీరగంధంగా కేతిరెడ్డే నటిస్తే బ్లాక్‌బస్టర్‌ గ్యారంటీ.. కేతిరెడ్డి వీరగంధం పాత్ర, ఆ వీపు సుందరిల కాంబినేషన్‌ సూపరో ..సూపర్‌.. స్వర్గీయ ఎన్టీఆర్‌ ఆయనపై ఓ లారీ నిండా అక్షింతలు తెచ్చి కేతిరెడ్డిపై చల్లుతాడు.. అంటూ ఓ ఆటాడేసుకున్నాడు. 

RGV Satires on Lakshmi's Veeragrandham and Praises Revanth Reddy:

Ram Gopal Varma Facebook posts Sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs