Advertisement
Google Ads BL

నయనతార ఫొటోతో పడేసింది..!


దక్షిణాదిన టాప్ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే అందరూ నయనతార పేరే చెప్పేస్తారు. ఆమె తమిళంతో పాటు తెలుగులోనూ పలు సినిమాలతో బిజీ తారగా వుంది. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన 'జై సింహా'లో నటిస్తున్న నయన్ చిరంజీవి 'సై రా' లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తమిళంలో ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో ‘వేలైక్కరన్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్  ప్రస్తుతం రాజస్థాన్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక చిత్ర బృందం మొత్తం అజ్మీర్ దర్గాని విజిట్ చేసి అక్కడ కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది. 

Advertisement
CJ Advs

ఆ సన్నివేశాల షూట్ ఆతర్వాత ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇక ఆ రొమాంటిక్ సాంగ్  కోసం నయనతార ఒక తెల్లటి ఫ్రాక్ లో మెరిసిపోతుంది. ఆ డ్రెస్ వేసుకుని ఎంతో అందంగా ఆకర్షణీయంగా కూర్చుని ఉన్న ఫోటోని నయనతార ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యడమే కాకుండా...  ‘వేలైక్కరన్ సాంగ్ షూట్’ అంటూ క్లూ కూడా ఇచ్చేసింది. ప్రస్తుతం నయన్ వైట్ డ్రెస్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి ఆ ఫోటో లో నిజంగానే నయనతార తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతూ దేవకన్య లా కనబడుతుంది. ఇక ఈ రొమాంటిక్ సాంగ్ సినిమాకే హైలెట్ అంటుంది చిత్ర బృందం. మరి మీరు నయన్ దేవకన్య లుక్ ని ఓ లుక్ వెయ్యండి. 

Nayanthara Twitter Pic Sensation:

Nayanthara Latest Pic Sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs