Advertisement
Google Ads BL

'సాహో' ప్రభాస్ నిర్ణయానికి హ్యాట్సాఫ్!


టాలీవుడ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో ఎలా కనిపించినా అది స్పెషల్ అని చెప్పాలి. ఇక రన్ రాజా రన్  సినిమా హిట్ తో  రెండో సినిమాకే జాక్ పాట్ కొట్టిన సుజీత్ ప్రభాస్ ని డైరెక్ట్  చేసే ఛాన్స్ కొట్టేసాడు. ఈ సినిమాకి 'సాహో' అని టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడనే విషయం 'సాహో' ఫస్ట్ లుక్ తోనే అర్ధమయ్యింది.

Advertisement
CJ Advs

'బాహుబలి' ఇచ్చిన విజయంతో ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ 'సాహో' కి కూడా అదే మార్కెట్ ఏర్పర్చుకోవాలకుంటున్నాడు. ఈ సినిమా హిందీ మరియు తెలుగులో  చిత్రీకరిస్తున్నారు. ఇక ప్రభాస్ ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ సీన్స్ ని డూప్ లేకుండా చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. అయితే చిత్ర యూనిట్ ముందుగా యాక్షన్ సీన్స్ కోసం డూప్ అనుకున్నప్పటికీ.. ప్రభాస్ కి యాక్షన్ సీన్స్ తెగ నచ్చటంతో తానే స్వయంగా చేస్తా అన్నాడంట. అయితే సుజీత్ మాత్రం.. ప్రభాస్ తో యాక్షన్ సీన్స్ చేయించడం అంత మంచిది కాదని భావిస్తున్నాడట.

'బాహుబలి' సినిమా కోసం యుద్ధ సన్నివేశాల్లో కూడా ఇలా డూప్ లేకుండానే చేసిన ప్రభాస్ అప్పుడు ఒకసారి గాయపడ్డాడు. ఆ సమయంలో ప్రభాస్ కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. అందుకే సుజిత్ ఈ విషయంలో కొంచెం భయపడుతున్నాడట.  కానీ ప్రభాస్ మాత్రం మళ్లీ అదే తరహాలో సొంతంగా యాక్షన్ సీన్స్ చేస్తానని చెప్పడం చిత్ర యూనిట్ లో కొంచెం కంగారును కలిగిస్తోందని టాక్. ఇక ప్రభాస్ ఈ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ నటిస్తుంది.

Prabhas Stunts Stunning In Saaho:

Prabhas decided to take a huge risk by enacting some death defying stunts all by himself. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs