Advertisement
Google Ads BL

చరణ్‌బాబు రైడ్ అదిరింది...!


ఇటీవల మోదీ ఒకే దేశం. ఒకే పన్నుని జీఎస్టీ ద్వారా తెచ్చామని, ఇది జాతీయ సమైక్యతకు చిహ్నమని, ప్రజలంతా సమానమే అని ఇది నిరూపించింది అంటూ మాటలు చెప్పాడు. 8వేల కోట్ల భవంతిలో ఉంటున్న అంబానీది, 8 గజాల స్థలం లేని మనమంతా ఎలా ఒకటి అవుతాం? పుట్టినరోజు కానుకగా అంబానీ తన భార్యకు ఓ భారీ షిప్పుని గిఫ్ట్‌ ఇచ్చాడు. కానీ మనం మాత్రం ఆటో ఎక్కుదామా? ఆటో ఎక్కితే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి కాబట్టి బస్సులో వెళ్లాలా? నడిచి వెళ్లాలా? అనే డైలమాలో మనం ఉంటున్నాం. ఇక విషయానికి వస్తే చిరంజీవి తాను మెగాస్టార్‌ కావడానికి ఎన్నో తిప్పలు, తిట్లు, అవమానాలు, డబ్బులు లేక ఇబ్బంది పడి ఉండవచ్చు గానీ ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ మాత్రం సిల్వర్‌ స్పూన్‌తో పుట్టాడు. ఇక ఆయన చేసుకున్న అపోలో వారసురాలు ఉపాసన కూడా కోట్లకు పడగలెత్తిన వ్యక్తి. కాబట్టి వారు ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా వెళ్లి హ్యాపీగా ఎంజాయ్‌ చేయగలరు. కానీ మనకు పార్క్‌లలో ఎంట్రీ ఫీజు కట్టడానికి కూడా డబ్బులుండవు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే సోషల్‌మీడియాలో రామ్‌చరణ్‌ భార్య ఉపాసన ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తన భర్త గురించి, తన గురించి, ఇతర విశేషాలు, సినిమాలు, జిమ్‌ వర్కౌట్స్‌ వంటి విషయాల దాకా సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇక తాజాగా ఆమె తాను తన భర్త ఉన్న రెండు వెరైటీ పిక్స్‌ని పోస్ట్‌ చేసింది. ఇందులో జడల బర్రెపై రామ్‌చరణ్‌ అటో కాలు ఇటో కాలు వేసుకుని ఉంటే..ఆ జడల గుర్రాన్ని ఉపాసన తాడు పట్టి నడిపిస్తోంది. మరి ఇది ఏ దేశమో, ఏ ప్రాంతమో ఆమె తెలపలేదు. బహుశా అది ఇండియా కాకపోవచ్చని, జడల బర్రెలు ఎక్కువగా ఉండే ఏ విదేశమో అయి ఉంటుందని చెప్పవచ్చు. అయినా సహజంగా ఆడవారు స్వారీ చేస్తుంటే మగవారు వాటిని పట్టుకుని నడిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్‌ రివర్స్‌. ఉపాసన ఎక్కితే రామ్‌చరణ్‌ నడవాల్సింది పోయి.. రామ్‌చరణ్‌ జంతువు మీద ఎక్కితే ఉపాసన దాని తాడును పట్టుకుని నడిపిస్తోంది.. అంతా జంబలకిడి పంబలా ఉంది ఈ వ్యవహారం. 

Upasana Takes Mr C a Ride:

Ram Charan Rides on a Buffalo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs